Homeక్రైమ్నిశ్చితార్థం రద్దు.. యువతి ఆత్మహత్య

నిశ్చితార్థం రద్దు.. యువతి ఆత్మహత్య

క్రైమ్ మిర్రర్ : హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. నిశ్చితార్థం రద్దు కావడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బండ్లగూడ జాగీర్‌ ప్రాంతంలో నివాసం ఉంటున్న నర్సింహ కుమార్తె కే. సంగీత (23)కు సుమారు ఐదు నెలల క్రితం వికారాబాద్‌కు చెందిన ఓ యువకుడితో నిశ్చితార్థం జరిగింది. అయితే కొంతకాలం తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో వివాహ నిశ్చితార్థం రద్దయింది.

నిశ్చితార్థం క్యాన్సల్‌ కావడంతో సంగీత కొంతకాలంగా మానసికంగా కలత చెందుతున్నట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. ఈ క్రమంలో 26వ తేదీన ఆమె ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న రాజేంద్రనగర్‌ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
also read : రాజేంద్రనగర్‌లో మిస్టరీ కేసును ఛేదించిన పోలీసులు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు