అనంతపురం, క్రైమ్మిర్రర్:అనంతపురం జిల్లాలో అమానుష ఘటన చోటు చేసుకుంది. పూజలు చేస్తే ధనవంతులవుతారని నమ్మించి బాలికను ఓ మహిళ చిత్రహింసలకు గురి చేసిన ఘటన అనంతపురంలో చోటు చేసుకుంది. నిరుపేద కుటుంబ కళ్యాణదుర్గం నుంచి జీవనోపాధి నిమిత్తం అనంతపురంలో నివాసముంటోంది. వీరి పేదరికాన్ని ఆసరాగా చేసుకుని ఓ మహిళ ధనవంతులు అవుతారని మాయమాటలు చెప్పి అభంశుభం తెలియని బాలికను ఇబ్బందులకు గురిచేసింది. వివస్త్రగా పూజలు చేస్తే ఐశ్వర్యవంతులు అవుతారంటూ బాలిక తల్లిదండ్రులకు మహాలక్ష్మి అనే మహిళ నమ్మించింది.
రహస్య ప్రదేశంలో పూజలు…
Also Read:కర్ణాటకలో వందేమాతరం రెండు చరణాలే.. సీఎం డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు
ధనవంతులవుతారని నమ్మించి హేమంత్ కుమార్ అనే వ్యక్తి బాలికను ఓ రహస్య ప్రదేశంలోకి తీసుకెళ్లి వివస్త్రను చేసి పూజలు చేశాడు. ఈ నెల 9న బాలిక, ఆమె తల్లిని సదరు మహిళ మరోసారి కడపకు తీసుకెళ్లి పూజల పేరుతో చిత్రహింసలకు గురిచేసింది. ఈ నెల 11న మరోసారి పూజల పేరుతో బాలికను, ఆమె తల్లిని కారులో తీసుకువెళ్తుండటాన్ని గమనించిన స్థానికులు.. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బాలిక, ఆమె తల్లిని వదిలిపెట్టి సదరు మహిళ పరారైంది. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన కడప పోలీసులు.. అనంతపురం వన్ టౌన్ పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు. నిందితుల వివరాలను సేకరించిన పోలీసులు.. వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Also Read: నేపాల్లో వరద విలయం.. 1,000 మంది గల్లంతు
