క్రైమ్ మిర్రర్ : కర్నూలు జిల్లాలో చోటుచేసుకున్న ఓ అరుదైన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆకలితో ఉన్న ఓ పందిపిల్ల ఆవు వద్దకు వెళ్లి పాలు తాగగా.. ఆవు కూడా ఎలాంటి అభ్యంతరం లేకుండా దానికి పాలు ఇచ్చింది. ఈ దృశ్యం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. వెల్దుర్తి పోలీస్‌స్టేషన్ ఎదురుగా ఉన్న ప్రధాన రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. ఆకలితో ఉన్న పందిపిల్ల ఆవు దగ్గరకు వెళ్లి పాలు తాగడం ప్రారంభించింది. ఆ సమయంలో ఆవు కూడా ప్రశాంతంగా నిలబడి పందిపిల్లకు పాలు ఇచ్చింది.
అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఈ దృశ్యాన్ని తన ఫోన్‌లో వీడియోగా చిత్రీకరించారు. అనంతరం సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వీడియో వైరల్‌గా మారింది. ఈ వింత ఘటనపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. పందిపిల్ల ఆకలి తీర్చేందుకు ఆవు చూపిన ప్రశాంతత, ఔదార్యాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు. ఆకలితో ఉన్న జీవికి ఆహారం అందించడంలో తల్లి ప్రేమకు హద్దులు ఉండవని ఈ దృశ్యం మరోసారి చాటుతోందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
also read : నేపాల్‌లో భారీ వరదలు.. బిహార్, ఉత్తర్‌ప్రదేశ్‌కు వరద ముప్పు!
