Homeఆంధ్ర ప్రదేశ్శ్రీవారి లడ్డూ ప్రసాదంపై వైరల్ వీడియో.. టీటీడీ స్పందన

శ్రీవారి లడ్డూ ప్రసాదంపై వైరల్ వీడియో.. టీటీడీ స్పందన

క్రైమ్ మిర్రర్ : శ్రీవారి లడ్డూ ప్రసాదంలో దారం కనిపించిందంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) స్పందించింది. లడ్డూ ప్రసాదాల తయారీలో అత్యంత కఠినమైన నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలను పాటిస్తున్నామని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న వీడియో తమ దృష్టికి వచ్చిందని టీటీడీ తెలిపింది. భక్తుల మనోభావాలను దెబ్బతీసే అవకాశం ఉన్నందున నిర్ధారణ లేని వీడియోలు, సమాచారాన్ని ప్రచారం చేయవద్దని భక్తులకు విజ్ఞప్తి చేసింది.

టీటీడీ ఆధ్వర్యంలో ప్రతిరోజూ శ్రీ వైష్ణవ బ్రాహ్మణుల పర్యవేక్షణలో శ్రీవారి లడ్డూ ప్రసాదాలను పవిత్రత, పరిశుభ్రత ప్రమాణాలను పాటిస్తూ పెద్ద ఎత్తున తయారు చేసి భక్తులకు అందిస్తున్నట్లు పేర్కొంది. లడ్డూ తయారీకి వినియోగించే ముడి పదార్థాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఇంటిగ్రేటెడ్ సార్టింగ్ మిషన్ల ద్వారా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నట్లు వెల్లడించింది.

ముడి పదార్థాల నాణ్యత, పరిశుభ్రత విషయంలో కూడా కఠినమైన ప్రమాణాలను అమలు చేస్తున్నామని టీటీడీ తెలిపింది. లడ్డూ తయారీ ప్రక్రియలో ఇతర పదార్థాలు కలిసే అవకాశం లేకుండా నిరంతరం పర్యవేక్షణ కొనసాగుతోందని స్పష్టం చేసింది. టీటీడీ ప్రతిష్ఠను దెబ్బతీసే ఉద్దేశంతో కొందరు వ్యక్తులు నిర్ధారణ లేని వీడియోలను రూపొందించి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని పేర్కొంది. ఇలాంటి ప్రచారాన్ని నమ్మవద్దని, భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించవద్దని సూచించింది.

భక్తులు ఇటువంటి వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయకుండా ఉండాలని టీటీడీ కోరింది. లడ్డూ ప్రసాదానికి సంబంధించి ఏదైనా అనుమానాస్పద విషయం కనిపిస్తే వెంటనే టీటీడీ అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించింది. శ్రీవారి ప్రసాదాల పవిత్రత, నాణ్యత, పరిశుభ్రతను కాపాడేందుకు టీటీడీ అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఈ సందర్భంగా స్పష్టం చేసింది.
also read : తరుణ్‌ తేజ్‌పాల్‌ రెండు వారాల్లో లొంగిపో : సుప్రీంకోర్టు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు