ఫోన్ పోయిందనే ఆందోళన ఓ యువకుడి ప్రాణాలను బలిగొన్న విషాద ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. మనోహరాబాద్ మండలం పోతారం గ్రామానికి చెందిన మహేశ్ (25) ఆత్మహత్య చేసుకున్నాడు.
బోనాల పండుగ సందర్భంగా ఆదివారం బయటకు వెళ్లిన మహేశ్.. సోమవారం ఉదయం ఇంటికి తిరిగి వచ్చాడు. తన ఫోన్ కనిపించడం లేదని తల్లికి చెప్పిన అనంతరం గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు.
మహేశ్‌ను పిలిచినా స్పందించకపోవడంతో కుటుంబ సభ్యులు తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లారు. అప్పటికే అతడు ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యువకుడు ఈ తీవ్ర నిర్ణయం తీసుకోవడానికి దారితీసిన పరిస్థితులపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనతో పోతారం గ్రామంలో విషాదం నెలకొంది.
also read: ట్యాక్సీనే చిన్న షాపింగ్ స్టోర్.. బ్యాంకాక్ డ్రైవర్ ఐడియాకు ఫిదా అవుతున్న నెటిజన్లు!
