Homeక్రైమ్ఎల్కతుర్తి కారు హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. తండ్రి ఆదేశాలతోనే కూతురిని చంపిన ప్రియుడు!

ఎల్కతుర్తి కారు హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. తండ్రి ఆదేశాలతోనే కూతురిని చంపిన ప్రియుడు!

హన్మకొండ జిల్లాలోని ఎల్కతుర్తిలో కారులో మహిళ మృతదేహం లభ్యమైన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన మానసను ఆమె ప్రియుడు వినోద్‌కుమార్‌ హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం.

పోలీసుల విచారణలో వినోద్‌కుమార్‌ కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. మానసను హత్య చేయాలని ఆమె తండ్రి రాజేశమే తనకు చెప్పినట్లు అతడు ఒప్పుకున్నట్లు సమాచారం. మానస గతంలో రెండుసార్లు వివాహం చేసుకుని విడాకులు తీసుకున్న అనంతరం వినోద్‌కుమార్‌తో ప్రేమలో పడినట్లు పోలీసులు గుర్తించారు.

తనను పెళ్లి చేసుకోవాలని మానస ఒత్తిడి చేస్తోందని వినోద్‌కుమార్‌ ఆమె తండ్రి రాజేశంకు చెప్పినట్లు తెలుస్తోంది. అయితే కుటుంబ పరువు పోతుందని భావించిన రాజేశం.. మానసను హత్య చేయాలని వినోద్‌కు సూచించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం.

రాజేశం ఆదేశాల మేరకు వినోద్‌కుమార్‌ మానసను గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం మృతదేహాన్ని కారులో తరలించి ఎల్కతుర్తి ప్రాంతంలో వదిలినట్లు దర్యాప్తులో తేలినట్లు సమాచారం.

కారులో మానస మృతదేహం బయటపడటంతో కేసు నమోదు చేసిన పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. విచారణలో ప్రియుడి పాత్ర వెలుగులోకి రావడంతో అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా హత్యకు సంబంధించిన విషయాలు బయటపడ్డట్లు తెలుస్తోంది. ఈ కేసులో మానస తండ్రి రాజేశం పాత్రపైనా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

also read: ఉప్పుటేరు వద్ద లభ్యమైన మహిళ మృతదేహం కేసులో భర్తే హంతకుడు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు