న్యూఢిల్లీ,క్రైమ్‌మిర్రర్: భారత్ దేశానికి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ వచ్చే నెలలో న్యూఢిల్లీలో జరిగే బ్రిక్స్ సదస్సుకు హాజరయ్యే అవకాశం ఉందని మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇదే గనుక జరిగితే సుమారు ఏడేళ్ల తరువాత భారత్ ను పర్యటించినట్లు అవుతుంది. 2020లో గల్వాన్ ఘర్షణల తర్వాత భారత్-చైనా సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇప్పుడు ఇరు దేశాల మధ్య సంబంధాలు క్రమంగా మెరుగుపడుతున్న నేపథ్యంలో ఈ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది.
జిన్‌పింగ్ వెంట 400 మంది అధికారులు హాజరయ్యే అవకాశం…
Also Read: గిరిజన గురుకుల ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్…! 62 ఏళ్ల వరకు రిటైర్‌మెంట్
2019లో జిన్‌పింగ్ భారత్‌కు వచ్చినప్పుడు ఆయన వెంట వచ్చిన బృందంలో 200 మందికి లోపే ఉన్నారు. కాని ఈసారి పర్యటనలో ఆయన వెంట సుమారు 400 మంది అధికారులు, ప్రతినిధులతో కూడిన భారీ బృందం భారత్‌కు వచ్చే అవకాశం ఉందని అంతర్జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. పర్యటనను పురస్కరించుకొని చైనా అధికారులు ఇప్పటికే న్యూఢిల్లీలో హోటల్ ఏర్పాట్లు, భద్రతా ప్రోటోకాల్స్ ఖరారు చేసే పనిని ప్రారంభించినట్టు సమాచారం.
భారత్ బ్రిక్స్ సదస్సుకు ఆతిథ్యం…
Also Read:సున్నితమైన పాత్రలకే నా ఓటు.. నటుడు సిద్ధార్థ్ ఆసక్తికర వ్యాఖ్యలు
భారత్ ఈ ఏడాది బ్రిక్స్ సదస్సుకు ఆతిథ్యం ఇస్తోంది . సెప్టెంబర్ 12, 13 తేదీల్లో న్యూఢిల్లీలో సదస్సు జరగనుంది. జిన్‌పింగ్ హాజరు ఖరారైతే.. బ్రిక్స్ అంశాల కంటే భారత్-చైనా సంబంధాల్లో వచ్చిన మార్పుపైనే అంతర్జాతీయ దృష్టి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అయితే జిన్‌పింగ్ పర్యటనను చైనా అధికారికంగా ఇంకా ధ్రువీకరించలేదు. బ్రిక్స్ సహకారానికి తాము ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నామని, ఈ ఏడాది సదస్సును విజయవంతంగా నిర్వహించేందుకు భారత్‌కు మద్దతు ఇస్తామని మాత్రమే చైనా విదేశాంగ శాఖ తెలిపింది. ప్రస్తుతం జిన్‌పింగ్ పర్యటనపై తమ వద్ద సమాచారం లేదని పేర్కొంది.
