Homeక్రైమ్లక్నో సమీపంలో భారీ డ్రగ్స్‌ పట్టివేత.. 18 కిలోల హెరాయిన్‌ స్వాధీనం

లక్నో సమీపంలో భారీ డ్రగ్స్‌ పట్టివేత.. 18 కిలోల హెరాయిన్‌ స్వాధీనం

ఉత్తరప్రదేశ్‌లో భారీ డ్రగ్స్‌ రాకెట్‌ గుట్టురట్టైంది. లక్నో సమీపంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్‌ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో భారీగా హెరాయిన్‌ పట్టుబడింది. వాహనాల్లో రహస్యంగా దాచి తరలిస్తున్న సుమారు 18 కిలోల హెరాయిన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

డ్రగ్స్‌ను అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారంతో అధికారులు తనిఖీలు చేపట్టగా.. వాహనాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రహస్య ప్రదేశాల్లో మత్తుపదార్థాలను గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి అంతర్రాష్ట్ర డ్రగ్స్‌ ముఠాకు చెందిన ముగ్గురు నిందితులను అరెస్ట్‌ చేశారు.

నిందితులు హెరాయిన్‌ను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ డ్రగ్స్‌ నెట్‌వర్క్‌ వెనుక ఎవరున్నారు? మత్తుపదార్థాలు ఎక్కడి నుంచి సరఫరా అవుతున్నాయి? ఎక్కడికి తరలిస్తున్నారు? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.

అరెస్టయిన నిందితులను అధికారులు విచారిస్తున్నారు. వారి నుంచి లభించే సమాచారంతో ఈ అంతర్రాష్ట్ర డ్రగ్స్‌ ముఠాకు సంబంధించిన మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ కేసులో మరికొందరికి ప్రమేయం ఉందా? అనే అంశంపైనా అధికారులు దృష్టి సారించారు.

also read: ఫోన్ పోయిందన్న భయంతో యువకుడి ఘోర నిర్ణయం- ఉరేసుకొని బలవన్మరణం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు