క్రైమ్ మిర్రర్ : నగరంలో ఎలాంటి వైద్య అర్హతలు లేకుండా ప్రజలకు చికిత్స అందిస్తున్న నకిలీ డాక్టర్లపై హైదరాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు. జూబ్లీహిల్స్, సికింద్రాబాద్ జోన్ పరిధిలో దాడులు చేసి 11 మంది నకిలీ డాక్టర్లు, ఓ మెడికల్ షాపు యజమానిని అరెస్ట్ చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం.. కాంపౌండర్లు, ల్యాబ్ టెక్నీషియన్లుగా పనిచేసిన అనుభవంతో కొందరు వ్యక్తులు బస్తీ ప్రాంతాల్లో క్లినిక్లు ఏర్పాటు చేసి డాక్టర్లుగా చలామణి అవుతున్నారు. గ్లూకోజ్ ఎక్కించడం, పిల్లలకు చికిత్స చేయడం, మందులు రాయడం వంటి వైద్య సేవలు అందిస్తూ రోగుల నుంచి రూ.50 నుంచి రూ.200 వరకు వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. కొందరు గడువు ముగిసిన మందులను సైతం రోగులకు ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు.
నకిలీ డాక్టర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని టాస్క్ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ తెలిపారు. ప్రజలు గుర్తింపు లేని క్లినిక్లు, వైద్యుల వద్ద చికిత్స తీసుకోవద్దని, అనుమానాస్పద వ్యక్తుల సమాచారం వెంటనే పోలీసులకు అందించాలని సూచించారు. నకిలీ వైద్యం వల్ల ఎవరైనా నష్టపోయి ఉంటే పోలీసులను సంప్రదించాలని కోరారు.
also read : శ్రీవారి లడ్డూ ప్రసాదంపై వైరల్ వీడియో.. టీటీడీ స్పందన
