Homeఅంతర్జాతీయంపసికందులపై మృత్యు పంజా.. అగ్నిప్రమాదంలో నవజాత శిశువులు సజీవ దహనం

పసికందులపై మృత్యు పంజా.. అగ్నిప్రమాదంలో నవజాత శిశువులు సజీవ దహనం

క్రైమ్ మిర్రర్ : పాకిస్థాన్‌ రాజధాని ఇస్లామాబాద్‌లోని పాకిస్థాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (PIMS)లో బుధవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆస్పత్రిలోని గైనకాలజీ విభాగానికి చెందిన నవజాత శిశువుల సంరక్షణ కేంద్రంలో మంటలు చెలరేగడంతో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో నర్సరీలో 15 మంది నవజాత శిశువులు ఉన్నట్లు ఆస్పత్రి అధికారులు తెలిపారు. మంటలు, దట్టమైన పొగ వ్యాపించడంతో 14 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఒక శిశువును మాత్రం సురక్షితంగా బయటకు 

ప్రాథమిక సమాచారం ప్రకారం.. నర్సరీలోని ఏసీ యూనిట్‌ కంప్రెసర్‌లో పేలుడు సంభవించిన తర్వాత మంటలు చెలరేగినట్లు రెస్క్యూ అధికారులు తెలిపారు. అయితే ప్రమాదానికి అసలు కారణం, మంటలు వేగంగా వ్యాపించడానికి గల పరిస్థితులపై సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక, రెస్క్యూ బృందాలు ఆస్పత్రికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. సహాయక చర్యలు చేపట్టి వార్డులో ఉన్న వారిని 

చిన్నారుల మృతితో ఆస్పత్రి వద్దకు చేరుకున్న తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఘటనపై పాకిస్థాన్‌ ప్రధాని షెహ్‌బాజ్‌ షరీఫ్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసి, తక్షణమే విచారణకు ఆదేశించారు. ప్రమాదానికి గల కారణాలు, ఆస్పత్రిలోని అగ్నిమాపక భద్రతా ఏర్పాట్లు, అత్యవసర స్పందనపై విచారణ చేసేందుకు కమిటీని ఏర్పాటు చేశారు.
also read: కర్నూలులో వింత ఘటన.. ఆవు పాలు తాగిన పందిపిల్ల

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు