క్రైమ్ మిర్రర్ : తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ముగ్గురు మహిళలు మద్యం మత్తులో నడిరోడ్డుపై హంగామా చేసిన ఘటన కలకలం రేపింది. వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ ఆలయం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మద్యం సేవించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు మహిళలు రోడ్డుపై వెళ్తున్న ఇద్దరు యువకులతో కారణం లేకుండా వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. కొద్దిసేపటికి మాటామాటా పెరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
ఈ క్రమంలో మహిళలు యువకులపై బహిరంగ ప్రదేశంలోనే దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. దీంతో అక్కడ కొద్దిసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. ఘటనతో ఇబ్బందికి గురైన యువకులు వెంటనే వన్‌టౌన్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు ముగ్గురు మహిళలపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని న్యాయస్థానంలో హాజరుపరచగా.. న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
also read : భక్తులపైకి దూసుకొచ్చిన కారు.. ఐదుగురు మృతి
