Homeతెలంగాణదారుణం...భ‌ర్త‌ను హ‌త్య చేసిన భార్య‌...!

దారుణం…భ‌ర్త‌ను హ‌త్య చేసిన భార్య‌…!

అంబేడ్కర్ కోనసీమ జిల్లా, క్రైమ్‌మిర్ర‌ర్‌: అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో దారుణ ఘటన జరిగింది. రామచంద్రపురంలో భార్య తన భర్తను కొట్టి హత్య చేసిన ఘటన తో ఆ ప్రాంతంలో క‌ల‌క‌లం రేపింది. రామచంద్రపురానికి చెందిన తంగేటి ఎల్లారావు (46)ను అతని భార్య ఉమాదేవి దాడి చేసి హత్య చేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వంటిట్లో వాడే ఓ ఆయుధంతో కొట్టడంతో ఎల్లారావు తీవ్రంగా గాయపడి మృతి చెందాడు.

Also Read:హైదరాబాద్‌లో ఫేక్ డాక్టర్లపై ఉక్కుపాదం.. 11 మంది అరెస్ట్

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భార్య ఉమాదేవిపై ఎల్లారావుకు కొంతకాలంగా అనుమానం ఉండేది. ఈ విషయమై భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ విభేదాలే చివరకు హత్యకు దారితీసింది. ఎల్లారావు మొదటి భార్య సుమారు 15 ఏళ్ల క్రితం మృతి చెందింది. అనంతరం ఉమాదేవిని రెండో వివాహం చేసుకున్న ఎల్లారావు.. ఆమెతో కలిసి రామచంద్రపురంలో అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు. వృత్తిరీత్యా వంట పనులు చేసుకుంటూ జీవించేవాడు. భార్యపై అనుమానంతో తరచూ ఆమెతో అతను గొడవపడేవాడు.

Also Read: ప్రేమ గెలిచింది.. ట్రాన్స్‌జెండర్ మహిళను పెళ్లాడిన ఆలయ అర్చకుడు

ఈ నెల 25వ తేదీన ఎల్లారావు మద్యం సేవించి ఇంటికి వచ్చి భార్య ఉమాదేవితో ఘర్షణకు దిగాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వివాదం ముదిరింది. అనంతరం ఉమాదేవి దాడి చేయడంతో ఎల్లారావు తీవ్రంగా గాయపడి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై మృతుడి సోదరుడు తంగేటి సూరిబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఉమాదేవిపై కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు