Homeతెలంగాణరామకృష్ణాపూర్‌ ఏరియా ఆసుపత్రిలో అధునాతన వైద్య సేవలు...!

రామకృష్ణాపూర్‌ ఏరియా ఆసుపత్రిలో అధునాతన వైద్య సేవలు…!

  • జీఎం ఎన్‌.రాధాకృష్ణ పర్యవేక్షణలో వసతుల మెరుగుదల

  • డీవైసీఎంఓ డాక్టర్‌ మధుకుమార్‌ నేతృత్వంలో సేవల విస్తరణ

  • నెలకు 200–300 శస్త్రచికిత్సలు.. ఆధునిక పరికరాలతో సత్వర వైద్యం

 

 

రామకృష్ణాపూర్‌, (క్రైమ్‌ మిర్రర్‌): సింగరేణి కార్మికులు, ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా రామకృష్ణాపూర్‌ ఏరియా ఆసుపత్రిలో వైద్య సదుపాయాలను విస్తరిస్తున్నారు. ఏరియా జనరల్‌ మేనేజర్‌ ఎన్‌.రాధాకృష్ణ పర్యవేక్షణలో, డీవైసీఎంఓ డాక్టర్‌ మధుకుమార్‌ నేతృత్వంలో ఆసుపత్రిలో ఆధునిక పరికరాలు, మెరుగైన వసతులను అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో స్థానికంగానే క్లిష్టమైన శస్త్రచికిత్సలు నిర్వహిస్తూ రోగులకు మెరుగైన వైద్యం అందిస్తున్నారు.

పెరిగిన ఇన్‌పేషెంట్‌ సేవలు…

రామకృష్ణాపూర్‌ ఏరియా ఆసుపత్రిలో అధునాతన వైద్య సేవలు...!
రామకృష్ణాపూర్‌ ఏరియా ఆసుపత్రిలో అధునాతన వైద్య సేవలు…!

Also Read:హైదరాబాద్‌లో కొత్త తరహా సైబర్ మోసం.. సెల్‌ఫోన్‌ చోరీ చేసి బ్యాంక్‌ ఖాతాలు ఖాళీ

ఆసుపత్రిలో వైద్య సేవలు మెరుగుపడటంతో రోగుల సంఖ్య గణనీయంగా పెరిగింది. గతంలో రోజుకు 200 నుంచి 300 వరకు ఉన్న ఇన్‌పేషెంట్ల సంఖ్య ప్రస్తుతం 400 నుంచి 500కు చేరినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. వైద్య సేవలపై నమ్మకం పెరగడంతో సింగరేణి కార్మికులు, ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు స్థానిక ఆసుపత్రికే ప్రాధాన్యం ఇస్తున్నారు.

శస్త్రచికిత్సల్లో గణనీయమైన పెరుగుదల…

Also Read:చింతూరు పోలీసుల ఎదుట ముగ్గురు మావోయిస్టుల లొంగుబాటు

గతంలో నెలకు సుమారు 50 నుంచి 60 శస్త్రచికిత్సలు మాత్రమే జరిగేవి. ప్రస్తుతం నెలకు 200 నుంచి 300 వరకు శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నారు. సాధారణ శస్త్రచికిత్సలతో పాటు క్లిష్టమైన కేసులకు కూడా స్థానికంగానే చికిత్స అందిస్తున్నారు.

రెండు కిలోల గడ్డ తొలగింపు…

Also Read: మద్యం మత్తులో మహిళల హల్‌చల్‌.. యువకులపై దాడి

ఇటీవల కడుపునొప్పితో ఆసుపత్రికి వచ్చిన ఓ మహిళను వైద్యులు పరీక్షించారు. ఆమె కడుపులో దాదాపు రెండు కిలోల బరువున్న గడ్డ ఉన్నట్లు గుర్తించారు. వైద్య బృందం అవసరమైన పరీక్షలు నిర్వహించి శస్త్రచికిత్స ద్వారా గడ్డను విజయవంతంగా తొలగించింది. ప్రస్తుతం బాధితురాలు ఆరోగ్యంగా కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు.

మోకాలు, తుంటి మార్పిడి…

Also Read:ఘోర రోడ్డు ప్రమాదం.. యూట్యూబర్, ఆమె తల్లి మృతి

ఆర్థోపెడిక్‌ విభాగంలో మోకాలు, తుంటి కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సలను కూడా నిర్వహిస్తున్నారు. గతంలో ఇటువంటి చికిత్సల కోసం హైదరాబాద్‌ వంటి నగరాలకు వెళ్లాల్సి వచ్చేది. ప్రస్తుతం స్థానికంగానే శస్త్రచికిత్సలు అందుబాటులోకి రావడంతో రోగులకు ప్రయాణ, ఆర్థిక భారం తగ్గుతోంది.

రోగులకు నేరుగా రిపోర్టులు…

Also Read: భర్తతో వెళ్లేందుకు నిరాకరించిందని భార్యపై దాడి.. బండరాయితో కొట్టి హత్య

ఆసుపత్రిలో రోగులకు అందించే సేవల్లో పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ల్యాబ్‌ పరీక్షల ఫలితాలను ప్రింట్‌ రూపంలో నేరుగా రోగులకు అందిస్తున్నారు. సీటీ స్కాన్‌ ఫిలింలను కూడా రోగులకే అందజేస్తున్నారు. సిబ్బంది విధుల్లో యూనిఫాం పాటిస్తూ రోగులకు జవాబుదారీతనంతో సేవలందిస్తున్నారు.

ఆధునిక పరికరాల సమకూర్పు…

Also Read:పసికందులపై మృత్యు పంజా.. అగ్నిప్రమాదంలో నవజాత శిశువులు సజీవ దహనం

శస్త్రచికిత్సలను మరింత సురక్షితంగా నిర్వహించేందుకు ఆపరేషన్‌ థియేటర్లలో ఆధునిక మానిటర్లు, కొత్త ఓటీ టేబుళ్లు, ఇన్‌ఫ్యూజన్‌ పంపులు, వీన్‌ ఫైండర్లు వంటి పరికరాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. పిల్లలకు అవసరమైన వైద్య పరికరాలను కూడా సమకూర్చారు. అత్యవసర సమయాల్లో గని ప్రమాదాల్లో గాయపడిన వారిని సత్వరమే ఆసుపత్రికి తరలించేందుకు ‘సంజీవని అంబులెన్స్‌’ సేవలను అందుబాటులో ఉంచారు.

వైద్యుల సమన్వయంతో…

Also Read:కర్నూలులో వింత ఘటన.. ఆవు పాలు తాగిన పందిపిల్ల

డీవైసీఎంఓ డాక్టర్‌ మధుకుమార్‌ పర్యవేక్షణలో ఆసుపత్రి వైద్య సేవలు కొనసాగుతున్నాయి. ఆర్థోపెడిక్‌ వైద్యులు డాక్టర్‌ విక్రమ్‌, డాక్టర్‌ నరేష్‌, అనస్థీషియా నిపుణులు డాక్టర్‌ మధుకర్‌, డాక్టర్‌ రామ్‌ మైత్రి, ఆపరేషన్‌ థియేటర్‌ ఇన్‌చార్జి సిస్టర్‌ జ్యోతి ఆధ్వర్యంలోని నర్సింగ్‌, పారామెడికల్‌ సిబ్బంది శస్త్రచికిత్సల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు.

మరిన్ని సేవలకు ప్రణాళిక…

Also Read: నేపాల్‌లో భారీ వరదలు.. బిహార్, ఉత్తర్‌ప్రదేశ్‌కు వరద ముప్పు!

రాబోయే రోజుల్లో మరిన్ని అధునాతన వైద్య సేవలు, సంక్లిష్ట శస్త్రచికిత్సలను అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు చేపడుతున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. సింగరేణి కార్మికులు, ఉద్యోగులు,వారి కుటుంబ సభ్యులకు స్థానికంగానే నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు పేర్కొన్నారు. అందుబాటులో ఉన్న ఆధునిక వైద్య సేవలు, వసతులను సద్వినియోగం చేసుకోవాలని ఆస్పత్రి వర్గాలు కోరుతున్నాయి.

వైద్య సేవల్లో పురోగతి…

Also Read: కర్ణాటకలో వందేమాతరం రెండు చరణాలే.. సీఎం డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు

డీవైసీఎంఓ ఎం.మధు కుమార్…
సీఎంఓడాక్టర్ కిరణ్ రాజ్ ఆధ్వర్యంలో ఏరియా ఆసుపత్రిలో వైద్య సేవలు గణనీయంగా మెరుగుపడ్డాయని తెలిపారు సింగరేణి కార్మికులు ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్యం అందించేందుకు అవసరమైన సదుపాయాలను కల్పిస్తున్నామని, రాబోయే రోజుల్లో వైద్య సేవలను మరింత విస్తరించేందుకు చర్యలు తీసుకుంటామని డీవైసీఎంవో ఎం.మధు కుమార్ పేర్కొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు