పల్నాడు,క్రైమ్మిర్రర్: పల్నాడు జిల్లా చిలకలూరిపేట వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో ఏడుగురు మృతి చెందడంపై ఉప ముఖ్యమంత్రి దిగ్భ్రాంతి చెందారు. అధికారుల నుంచి ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేశారు.
Also Read: నేపాల్లో వరద విలయం.. 1,000 మంది గల్లంతు
మృతుల కుటుంబాలను కూటమి ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ప్రైవేట్ బస్సులపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రైవేట్ బస్సుల తనిఖీలు ముమ్మరం చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచించారు.
Also Read: హైదరాబాద్లో ‘డిజిటల్ అరెస్ట్’ మోసం.. 85 ఏళ్ల రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగికి షాక్
