తాడేపల్లి, క్రైమ్‌మిర్రర్: ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి సీటులో వైసీపీ అభ్యర్థి పోటీ చేసేలా చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. తాడేపల్లిలో జరిగిన పార్టీ సమావేశంలో జగన్ 175 అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్చార్జిలు, పార్టీ సమన్వయకర్తలు, ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో అధికార కూటమిపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని ఆయన ఆరోపించారు. ఈ అసంతృప్తిని ఓట్లుగా మలచుకోవాలంటే పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో మరింత చురుకుగా పనిచేయాలని సూచించారు.
ఏకగ్రీవాలకు అవకాశం ఇవ్వొద్దు…
Also Read: కర్నూలులో వింత ఘటన.. ఆవు పాలు తాగిన పందిపిల్ల
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ సీటు కూడా ఏకగ్రీవం కాకుండా చూడాలని జగన్ పార్టీ నేతలకు సూచించారు. ప్రతి స్థానంలో బలమైన అభ్యర్థిని నిలబెట్టి పోటీ తప్పనిసరి చేయాలని చెప్పారు. కొన్ని నియోజకవర్గాల్లో ఏకగ్రీవ ఎన్నికలు జరిగితే, సంబంధిత పార్టీ నాయకత్వం పనితీరును కూడా సీరియస్‌గా తీసుకుంటామని హెచ్చరించినట్లు నివేదికలు పేర్కొన్నాయి. కాగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలతో నిరంతరం మమేకం కావాలని జగన్ సూచించారు. ఇంటింటికీ వెళ్లి వైసీపీ పాలనకు, ప్రస్తుత కూటమి ప్రభుత్వ పనితీరుకు మధ్య తేడాను ప్రజలకు వివరించాలని ఆదేశించారు. రాబోయే కొన్ని నెలలు ఆయా నియోజకవర్గాల్లోనే ఉంటూ పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాలని నేతలకు సూచించారు. ఎన్నికల సన్నాహకాల్లో భాగంగా గ్రామస్థాయి వరకు పార్టీ క్యాడర్‌కు QR కోడ్‌తో కూడిన గుర్తింపు కార్డులు అందించడంతో పాటు ప్రచార సామగ్రి పంపిణీ చేయాలని వైసీపీ యోచిస్తోంది. జిల్లా, నియోజకవర్గం, మండలం, డివిజన్ స్థాయిల్లో సమావేశాలు నిర్వహించి ఎన్నికల యంత్రాంగాన్ని బలోపేతం చేయాలని జగన్ సూచించారు.
Also Read: నేపాల్‌లో భారీ వరదలు.. బిహార్, ఉత్తర్‌ప్రదేశ్‌కు వరద ముప్పు!
