మంచిర్యాల, క్రైమ్మిర్రర్: స్కూలు పిల్లలతో వెళ్తున్న ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన ఘటన మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం ముల్కలపేట-కల్మలపేట రహదారిపై గురువారం ఉదయం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న విద్యార్థులు గాయాలు కాగా మిగితా వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈఘటనతో ఒక్కసారిగా ఆప్రాంతంలో కలకలం రేగింది. వివరాల ప్రకారం సూపాక గ్రామానికి చెందిన విద్యార్థులు కోటపల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి మోడల్ స్కూల్ కు వెళ్తున్న క్రమంలో ముల్కలపేట-కల్మలపేట మధ్యలో రహదారిపై ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు బలంగా ఢీకొట్టింది.
Also Read:నేపాల్లో వరద విలయం.. 1,000 మంది గల్లంతు
ఈ ఘటనలో ఆటోలో ఉన్న విద్యార్థులకు గాయలు కాగా ఆటో ధ్వంసమైంది. ఘటన జరగడంలోగమనించిన స్థానికులు అక్కడికి చేరుకొని వెంటనే అంబులెన్స్ కు సమాచారంగా అందించారు. వెంటనే స్పందించిన అంబులన్స్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని గాయాలైన విద్యార్థులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. కాగా ఘటనలో ధ్వంసమైన ఆటోను, ఆర్టీసీ బస్సు ను పోలీసు స్టేషన్ కు తరలించినట్లు సమాచారం.
Also Read: హైదరాబాద్లో ‘డిజిటల్ అరెస్ట్’ మోసం.. 85 ఏళ్ల రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగికి షాక్
