Homeక్రైమ్ఇంట్లోనే మోడల్‌ హత్య.. జిమ్‌ ట్రైనర్‌పై అనుమానం

ఇంట్లోనే మోడల్‌ హత్య.. జిమ్‌ ట్రైనర్‌పై అనుమానం

 క్రైమ్ మిర్రర్ : దేశ రాజధాని ఢిల్లీలో ఓ యువ మోడల్‌ దారుణ హత్యకు గురైంది. పశ్చిమ ఢిల్లీలోని తిలక్‌నగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. 21 ఏళ్ల ముస్కాన్‌ చదువుకుంటూనే మోడలింగ్‌ చేస్తూ అదే ప్రాంతంలోని ఓ భవనంలో నివాసం ఉంటోంది. బుధవారం ముస్కాన్‌ ఇంటి నుంచి కేకలు వినిపించడంతో అప్రమత్తమైన స్థానికులు అక్కడికి చేరుకున్నారు. రక్తపు గాయాలతో ఆమె అపస్మారక స్థితిలో కనిపించడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ముస్కాన్‌ నివాసంతో పాటు పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాల దృశ్యాలను పరిశీలించారు. ప్రాథమిక దర్యాప్తులో ఆమెపై కత్తితో దాడి చేసిన అనంతరం ఓ వ్యక్తి అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ఈ కేసులో ముస్కాన్‌కు పరిచయమున్న జిమ్‌ ట్రైనర్‌ ఇమ్రాన్‌పై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అతడే కత్తితో దాడి చేసి పరారైనట్లు దర్యాప్తులో తేలినట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా ముస్కాన్‌ను ఇమ్రాన్‌ వేధిస్తున్నాడని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. ప్రస్తుతం నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. హత్యకు దారితీసిన కారణాలు, నిందితుడితో ముస్కాన్‌కు ఉన్న సంబంధాలపై పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. కేసు నమోదు చేసి సీసీటీవీ ఫుటేజ్‌, ఇతర ఆధారాలను పరిశీలిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
also read :80 మంది యాత్రికుల గల్లంతు.. కన్నీటిపర్యంతమైన సద్గురు జగ్గీ వాసుదేవ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు