Homeసినిమాహైదరాబాద్‌లో ‘టాక్సిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తొక్కిసలాట.. నలుగురు విద్యార్థులకు గాయాలు

హైదరాబాద్‌లో ‘టాక్సిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తొక్కిసలాట.. నలుగురు విద్యార్థులకు గాయాలు

హైదరాబాద్‌లోని మల్లారెడ్డి కాలేజీలో ‘టాక్సిక్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. శనివారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి భారీగా అభిమానులు, విద్యార్థులు తరలిరావడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది.

ఈ ఘటనలో నలుగురు విద్యార్థులు గాయపడినట్లు సమాచారం. వారిలో ఇద్దరికి కాళ్లకు ఫ్రాక్చర్ అయినట్లు తెలుస్తోంది. ఈవెంట్ సమయంలో భారీ సౌండ్ బాక్స్ సెట్ కూలిపోవడంతో ఒక్కసారిగా అక్కడ గందరగోళం ఏర్పడింది.

ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈవెంట్ నిర్వహణలో నిర్లక్ష్యం జరిగిందా? అనే కోణంలో చిత్ర యూనిట్‌తో పాటు కాలేజీ యాజమాన్యంపై కూడా విచారణ చేపట్టారు.

భారీగా జనసమీకరణ జరిగే కార్యక్రమాలకు భద్రతా ఏర్పాట్లు, జన నియంత్రణ చర్యలు పటిష్టంగా ఉండాల్సిన అవసరాన్ని ఈ ఘటన మరోసారి గుర్తుచేసింది.

also read: కరీనా కపూర్‌ మూడోసారి తల్లి కాబోతున్నారా? వైరల్‌ రూమర్స్‌పై హీరోయిన్‌ ఫన్నీ రియాక్షన్‌

తాజావార్తలు