బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ మూడోసారి తల్లి కాబోతున్నారంటూ సోషల్ మీడియాలో ఇటీవల ప్రచారం జరిగింది. ఓ ఫొటోలో ఆమె పొట్ట కాస్త ఉబ్బినట్లు కనిపించడంతో ఈ ఊహాగానాలు మొదలయ్యాయి. దీంతో అభిమానుల్లోనూ, నెటిజన్లలోనూ చర్చ మొదలైంది.
అయితే ఈ ప్రచారానికి కరీనా కపూర్ తనదైన స్టైల్‌లో సరదాగా చెక్ పెట్టారు. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పిజ్జా ఎమోజీతో పాటు నవ్వుతున్న ఎమోజీలను షేర్ చేస్తూ.. తన పొట్ట ఉబ్బినట్లు కనిపించడానికి కారణం గర్భం కాదని, తిన్న ఆహారమేనని హాస్యభరితంగా స్పష్టం చేశారు.
మరోవైపు కరీనా వదిన సబా పటౌడీ కూడా ఈ విషయంపై స్పందించారు. ఫొటోలో అలా కనిపించడానికి కెమెరా యాంగిల్ కారణం కావచ్చని, కరీనా ఫిట్‌గానే ఉన్నారని పేర్కొన్నారు.
కరీనా కపూర్‌కు సైఫ్ అలీఖాన్‌తో వివాహం జరిగిన విషయం తెలిసిందే. ఈ దంపతులకు తైమూర్, జహంగీర్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రస్తుతం కరీనా మూడోసారి తల్లి కాబోతున్నారన్న వార్తలకు ఆమె ఇచ్చిన ఫన్నీ రియాక్షన్‌తో ఈ రూమర్స్‌కు తెరపడినట్లైంది.
also read: వంకాయ కూర తిన్న తర్వాత ముగ్గురు అక్కాచెల్లెళ్ల మృతి.. వెలికితీసిన మృతదేహాలు
