Homeక్రైమ్ఘోర ప్రమాదం.. ముగ్గురు టెన్నిస్ క్రీడాకారులు మృతి

ఘోర ప్రమాదం.. ముగ్గురు టెన్నిస్ క్రీడాకారులు మృతి

క్రైమ్ మిర్రర్ : పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రహదారిపై నిలిపి ఉన్న ట్రక్కును వేగంగా వచ్చిన కారు వెనుక నుంచి ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు, క్షతగాత్రులు టెన్నిస్ క్రీడాకారులుగా పోలీసులు గుర్తించారు.

పోలీసుల వివరాల ప్రకారం.. అయోధ్య పరిధిలోని పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వే 97.500 కిలోమీటర్‌ వద్ద ఈ ప్రమాదం జరిగింది. లక్నోలో జరిగిన టెన్నిస్ ఈవెంట్‌లో పాల్గొన్న ఆరుగురు యువకులు కారులో దేవరియాకు తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యంలో ఆగి ఉన్న ట్రక్కును కారు ఢీకొట్టడంతో ఒక్కసారిగా ప్రమాదం చోటుచేసుకుంది. ఢీకొన్న వేగానికి కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. వాహనంలో ప్రయాణిస్తున్న వారు లోపలే చిక్కుకుపోవడంతో యూపీఈఐడీఏ భద్రతా సిబ్బంది, స్థానిక పోలీసులు తీవ్రంగా శ్రమించి వారిని బయటకు తీశారు.

ముగ్గురు మృతి.. మరో ముగ్గురి పరిస్థితి విషమం

ఈ ప్రమాదంలో దేవరియాకు చెందిన నిత్యా ప్రజాపతి (22), ఇర్ఫాన్ అన్సారీ (20), అనికేత్ (24) మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఆనంద్ యాదవ్ (23), రాజు (22), జయంత్ శర్మ (30) తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను తొలుత సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం అయోధ్యలోని దర్శన్ నగర్ మెడికల్ కాలేజీకి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

నిద్రలో ఉండగానే ప్రమాదం

ప్రమాద సమయంలో కారులో ఉన్న వారంతా నిద్రలో ఉన్నారని, అసలు ఏం జరిగిందో కూడా తమకు తెలియలేదని గాయపడిన జయంత్ పోలీసులకు తెలిపినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే ట్రక్కు డ్రైవర్ అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న ట్రక్కు డ్రైవర్‌ను గుర్తించి అదుపులోకి తీసుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.
also read : పెట్రోల్ బంక్ సీజ్‌కు వెళ్లిన ఇండియన్ ఆయిల్ అధికారి దారుణ హత్య

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు