ప్రముఖ కమెడియన్, యూట్యూబర్ ‘అగ్గిపెట్టి మచ్చా’ అలియాస్ కిరణ్ కుమార్ మృతి చెందారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తిరుపతిలోని సిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూశారు. కిరణ్ కుమార్ మృతిని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు.
యూట్యూబ్ ద్వారా ప్రేక్షకులకు దగ్గరైన కిరణ్ కుమార్.. ‘అగ్గిపెట్టి మచ్చా’ పేరుతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. తనదైన కామెడీ టైమింగ్, వినోదాత్మక శైలితో సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్నారు. ఆయన రూపొందించిన కామెడీ వీడియోలు, వివిధ వినోద కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
అయితే గత నాలుగు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న కిరణ్ కుమార్‌ను కుటుంబ సభ్యులు తిరుపతిలోని సిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం విషమించడంతో బుధవారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
కిరణ్ కుమార్ మృతితో ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానుల్లో విషాదం నెలకొంది. సోషల్ మీడియా వేదికగా ఆయనతో అనుబంధం ఉన్న పలువురు తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. తన కామెడీతో ప్రేక్షకులను అలరించిన ‘అగ్గిపెట్టి మచ్చా’ ఇక లేరన్న వార్త అభిమానులను తీవ్రంగా కలచివేసింది.
also read: ఘోర ప్రమాదం.. ముగ్గురు టెన్నిస్ క్రీడాకారులు మృతి
