Homeవైరల్మహారాష్ట్రలో విద్యార్థుల ఫ్రీస్టైల్ ఫైట్.. వైరల్‌గా మారిన వీడియో

మహారాష్ట్రలో విద్యార్థుల ఫ్రీస్టైల్ ఫైట్.. వైరల్‌గా మారిన వీడియో

నాగ్‌పూర్‌లోని ధన్వాటే నేషనల్ కాలేజ్ సమీపంలో విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణ చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ నగర్ మెట్రో స్టేషన్ వద్ద కొందరు విద్యార్థులు రోడ్డుపైనే ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. పిడిగుద్దులు గుద్దుకుంటూ ఫ్రీస్టైల్‌గా కొట్టుకున్న ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

గొడవ జరుగుతున్న సమయంలో కొందరు విద్యార్థులు ప్రవర్తించిన తీరు కూడా స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఘర్షణ మధ్యలోనే సినిమా స్టైల్‌లో పోజులు ఇవ్వడం, హెయిర్‌స్టైల్ సరిచేసుకోవడం వంటి దృశ్యాలు వీడియోలో కనిపించాయి.

అయితే విద్యార్థుల మధ్య గొడవకు అసలు కారణం ఏమిటన్నది ప్రస్తుతానికి స్పష్టంగా తెలియలేదు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా ఘర్షణలో పాల్గొన్న వారిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.

also read: తండ్రి అంత్యక్రియల ఖర్చులపై అన్నదమ్ముల మధ్య గొడవ.. అన్నను కత్తెరతో పొడిచి తమ్ముడు పరార్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు