క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్:- ఇంగ్లండ్ తో జరిగిన టీ20 సిరీస్ లో 4-0 తేడాతో చిత్తుగా ఓడిన టీమిండియా ఇప్పుడు వన్డే సిరీస్ పై కన్నేసింది. ఈ ఫార్మాట్ లో అయినా సత్తా చాటాలని అభిమానులు ఆశిస్తున్నారు. ముఖ్యంగా సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తిరిగి జట్టులోకి రాకతో బ్యాటింగ్ ఆర్డర్ బలపడిందని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.ఇంగ్లండ్ గడ్డపై ఆడిన అనుభవం ఈ ద్వయానికి పుష్కలంగా ఉండటం భారత్ కు కలిసొచ్చే అంశం. ఈ సిరీస్ లో ఎలాగైనా గెలిచి టీ20 సిరీస్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని ఆటగాళ్లు కసితో ఉన్నారు.రోహిత్, కోహ్లీలతో పాటు కేఎల్ రాహుల్, శుభ్ మన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా వంటి ఆటగాళ్ల ప్రదర్శన కూడా ఈ సిరీస్ లో కీలకం కానుంది. దీంతో ఇంగ్లాండ్ గడ్డపై ఇంగ్లాండ్ ఆటగాళ్లతో భారత్ ఎలాంటి ప్రదర్శన కనబరుస్తుందా అని ప్రేక్షకులు సైతం ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు.
బాలయ్యకు అన్నయ్యగా సంజయ్ దత్..? వర్కౌట్ అయ్యేనా!
ఓటరు జాబితాలో పేరు లేకపోతే చనిపోయినట్లే: ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు!