Homeఆంధ్ర ప్రదేశ్ఆ నెలలోనే స్థానిక ఎన్నికలు అంటున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

ఆ నెలలోనే స్థానిక ఎన్నికలు అంటున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలపై డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నవంబర్ నెలలోపే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణులు, నాయకులు ఇప్పటి నుంచే సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు.నిన్న జనసేన పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పవన్ కళ్యాణ్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించినట్లు సమాచారం. ముఖ్యంగా రాబోయే స్థానిక ఎన్నికలపై పార్టీ సన్నద్ధతను సమీక్షించారు. నాయకులు, క్యాడర్ ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు.ఈ ప్రకటనతో ఏపీ రాజకీయాల్లో మళ్లీ ఎన్నికల వేడి మొదలైనట్లయింది. అన్ని ప్రధాన పార్టీలు స్థానిక పోరుకు సన్నద్ధం అయ్యే పనిలో పడనున్నాయి.

మన ఓట్లను కాపాడుకోవాలి.. పార్టీ శ్రేణులకు సజ్జల పిలుపు!

Awiqli Insulin: ఇక రోజూ కాదు.. వారానికో ఇంజెక్షన్ చాలు.. షుగర్ బాధితులకు గుడ్ న్యూస్!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు