Homeఆంధ్ర ప్రదేశ్మన ఓట్లను కాపాడుకోవాలి.. పార్టీ శ్రేణులకు సజ్జల పిలుపు!

మన ఓట్లను కాపాడుకోవాలి.. పార్టీ శ్రేణులకు సజ్జల పిలుపు!

క్రైమ్ మిర్రర్,అమరావతి:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటరు జాబితాల సవరణ ప్రక్రియ (SIR) తుది దశకు చేరుకున్న నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) అప్రమత్తమైంది. పార్టీ నేతలు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండి తమ ఓట్లను కాపాడుకోవాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు.ఈ మేరకు ఆయన పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఓటరు జాబితాల్లో తమ పార్టీ సానుభూతిపరుల ఓట్లను తొలగించకుండా చూసుకోవడం అత్యంత కీలకమని ఆయన స్పష్టం చేశారు. అదే సమయంలో, దొంగ ఓట్లను తొలగించేలా చూడటం బూత్ లెవల్ ఏజెంట్ల (BLA) ప్రధాన బాధ్యత అని ఆయన గుర్తుచేశారు.అందరికీ ఎన్యుమరేషన్ ఫామ్స్ అందాయా లేదా అనేది సరిచూసుకోవాలని, తమ ఓట్లను తొలగించేందుకు కుట్రలు జరిగే అవకాశం ఉందని సజ్జల హెచ్చరించారు. ఈ ప్రక్రియలో ఏమాత్రం అశ్రద్ధ వహించినా నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని, కాబట్టి ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఆయన దిశానిర్దేశం చేశారు.

నటుడిగా మెహర్ రమేష్ రీఎంట్రీ?

Awiqli Insulin: ఇక రోజూ కాదు.. వారానికో ఇంజెక్షన్ చాలు.. షుగర్ బాధితులకు గుడ్ న్యూస్!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

తాజావార్తలు