క్రైమ్ మిర్రర్,హైదరాబాద్:- టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ మెహర్ రమేష్ గురించి ఒక ఆసక్తికరమైన వార్త ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. పలువురు స్టార్ హీరోలతో సినిమాలు తెరకెక్కించిన ఆయన మళ్లీ వెండితెరపై కనిపించనున్నారని సమాచారం. అయితే, ఈసారి ఆయన మెగాఫోన్ పట్టుకొని కాకుండా, కెమెరా ముందు నటుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నట్లు సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.ఓ తాజా సినిమాలో మెహర్ రమేష్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారని, ఇప్పటికే ఆ పాత్రకు సంబంధించిన కొంత షూటింగ్ కూడా పూర్తయినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. కాగా, ఆయన గతంలోనే నటుడిగా పరిచయమయ్యారు. మహేష్ బాబు నటించిన ‘బాబీ’ సినిమాలో ఒక చిన్న పాత్రలో మెహర్ రమేష్ కనిపించి మెప్పించారు.ఆ తర్వాత దర్శకత్వం వైపు అడుగులేసిన ఆయన పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. అయితే, చివరగా ఆయన మెగాస్టార్ చిరంజీవితో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘భోళా శంకర్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఆయన నటుడిగా రీఎంట్రీ ఇస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ వార్తలపై మెహర్ రమేష్ లేదా చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Awiqli Insulin: ఇక రోజూ కాదు.. వారానికో ఇంజెక్షన్ చాలు.. షుగర్ బాధితులకు గుడ్ న్యూస్!