Homeక్రైమ్భార్యను హెల్మెట్‌తో కొట్టి చంపాడు.. చిన్న గొడవ పెద్ద విషాదం! కర్ణాటకలో షాకింగ్ ఘటన

భార్యను హెల్మెట్‌తో కొట్టి చంపాడు.. చిన్న గొడవ పెద్ద విషాదం! కర్ణాటకలో షాకింగ్ ఘటన

కర్ణాటకలో మరోసారి గృహహింస దారుణ రూపం దాల్చింది. హుబ్బಳ್ಳಿ గ్రామీణ పరిధిలోని తరిహాల్ గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. కేవలం చిన్న కుటుంబ వివాదం ప్రాణాంతకంగా మారి, ఓ యువతి ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదానికి దారితీసింది.
వివరాల్లోకి వెళ్తే.. నాగరత్నం (19) అనే యువతి ఇటీవలే శివరాజ్‌తో వివాహం జరిగింది. అయితే బుధవారం ఉదయం దంపతుల మధ్య స్వల్ప విషయంపై వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ గొడవ క్రమంగా తీవ్రరూపం దాల్చడంతో కోపావేశానికి లోనైన భర్త శివరాజ్, ఇంట్లో ఉన్న మోటార్ సైకిల్ హెల్మెట్‌తో నాగరత్నం తలపై దాడి చేసినట్లు తెలుస్తోంది.

ఈ దాడిలో నాగరత్నం తీవ్రంగా గాయపడి, అధిక రక్తస్రావంతో అక్కడికక్కడే కుప్పకూలింది. పరిస్థితి విషమించడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, గృహహింస కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు సమాచారం. కుటుంబ వివాదాలు ఎంత తీవ్రమైన పరిణామాలకు దారితీస్తాయో ఈ ఘటన మరోసారి గుర్తుచేసింది. ఈ సంఘటన స్థానికంగా భయాందోళనలకు గురిచేసింది. సమాజంలో పెరుగుతున్న గృహహింస ఘటనలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

also read: రూ.2,000 నోటు ఇంకా మీ దగ్గర ఉందా? నోటుపై RBI క్లారిటీ – ఇప్పటికీ చెల్లుబాటు అవుతుందా?

తాజావార్తలు