క్రైమ్ మిర్రర్, సినిమా:- రాకింగ్ స్టార్ యశ్, దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ కాంబినేషన్లో తెరకెక్కిన భారీ చిత్రం టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్. కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదలకు ముందు హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ-రిలీజ్ వేడుకలో ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.టాక్సిక్ విజువల్స్ తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని దిల్ రాజు తెలిపారు. కేజీఎఫ్ తర్వాత యశ్ ఓ విభిన్నమైన దర్శకురాలితో పనిచేస్తున్నారని తెలిసినప్పుడు మొదట ఆశ్చర్యపోయానని, అయితే ముంబైలో సినిమా రషెస్ చూసిన తర్వాత తన అభిప్రాయం పూర్తిగా మారిపోయిందని చెప్పారు. ఈ చిత్రం సాధారణ పాన్ ఇండియా సినిమాగా కాకుండా గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకునే సత్తా ఉన్నదని ఆయన అభిప్రాయపడ్డారు.
ఓటీటీలోకి సడన్ ఎంట్రీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఒంటరిగా చూస్తే వెన్నులో వణుకు పక్కా!
సినిమాపై ఉన్న నమ్మకంతోనే తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులను ఎలాంటి సందేహం లేకుండా తీసుకున్నట్లు దిల్ రాజు వెల్లడించారు. ‘టాక్సిక్’లోని విజువల్స్, యశ్ స్క్రీన్ ప్రెజెన్స్, దర్శకురాలి టేకింగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని ఆయన అన్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించే సామర్థ్యం ఉందని పేర్కొన్నారు. సంగీత దర్శకుడు విశాల్ మిశ్రా కూడా ఈ సినిమా రూ.2,000 కోట్ల వరకు వసూళ్లు సాధించే సత్తా ఉందని చెప్పిన విషయాన్ని దిల్ రాజు గుర్తుచేశారు.ఇదే సమయంలో యశ్‌తో దిల్ రాజు బ్యానర్లో సినిమా ఎప్పుడు అనే ప్రశ్నకు కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. యశ్‌తో తమ నిర్మాణ సంస్థలో సినిమా చేయడం నూటికి నూరు శాతం ఖాయమని ప్రకటించారు. అయితే ప్రస్తుతం సరైన కథ కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు. తనకు, యశ్‌కు సరిపోయే బలమైన కథ సిద్ధమైన వెంటనే ఆ ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తామని చెప్పారు. సినిమా ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుందనే విషయంపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు.మొత్తంగా టాక్సిక్ పై దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. మరోవైపు యశ్‌తో తమ బ్యానర్లో సినిమా పక్కా అంటూ ఆయన చేసిన ప్రకటన ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. టాక్సిక్ విడుదల తర్వాత యశ్ మార్కెట్ మరింత విస్తరిస్తుందా, దిల్ రాజు-యశ్ కాంబినేషన్ ఎలాంటి కథతో ప్రేక్షకుల ముందుకు వస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.
