Homeక్రైమ్సుమంత్ కేసులో కీలక పరిణామం.. వ్యక్తిగత డ్రైవర్ అరెస్ట్

సుమంత్ కేసులో కీలక పరిణామం.. వ్యక్తిగత డ్రైవర్ అరెస్ట్

తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్‌పై నమోదైన కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ కేసుకు సంబంధించి సుమంత్ వ్యక్తిగత డ్రైవర్‌ను ఆదివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. తెల్లాపూర్‌లోని సుమంత్ నివాసానికి సమీపంలో డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.

బోడుప్పల్‌కు చెందిన వ్యాపారి గొంగిడి హరికృష్ణపై దాడి చేసి బెదిరింపులకు పాల్పడ్డారనే ఆరోపణలపై సుమంత్‌తో పాటు ప్రశాంత్, రాము, కార్తీక్, అరుణ్ కుమార్ రెడ్డి, మహేందర్ రెడ్డిలపై పోలీసులు కేసు నమోదు చేశారు.

తనను రూ.10 కోట్లు డిమాండ్ చేశారని, ఆ మొత్తాన్ని ఇచ్చేందుకు తాను నిరాకరించడంతో తనపై దాడి చేశారని హరికృష్ణ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనలో తన ఎడమ చేయికి ఫ్రాక్చర్ కావడంతో పాటు ఇతర గాయాలు కూడా అయినట్లు తెలిపారు.

బాధితుడి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పటికే దర్యాప్తు చేపట్టారు. తాజాగా సుమంత్ వ్యక్తిగత డ్రైవర్‌ను అదుపులోకి తీసుకోవడంతో కేసు విచారణలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. డ్రైవర్‌ను విచారిస్తూ ఘటనకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నట్లు సమాచారం.

also read: ఆటో, క్యాబ్ డ్రైవర్లకు మంత్రి కీలక విజ్ఞప్తి.. బంద్ విరమించుకోవాలని పొన్నం ప్రభాకర్ పిలుపు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు