Homeతెలంగాణబీసీ కార్డు ఫలిస్తుందా?!

బీసీ కార్డు ఫలిస్తుందా?!

-టిపిసిసి క్రమశిక్షణ కమిటీకి మంత్రి కొండా సురేఖ లేఖ
-బలహీన వర్గాల మహిళను అంటూ ప్రస్తావన
-వేటు వేసిన మరుక్షణం తిరుగుబాటుకు నిర్ణయం
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో
:- తెలంగాణ మంత్రి కొండా సురేఖ రాజకీయ అడుగులు ఎటు? మంత్రివర్గం నుంచి తొలగిస్తే ఆమె ఏం చేస్తారు? పార్టీ వేటు వేస్తే ఏ పార్టీలో చేరుతారు? ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో దీనిపైనే ప్రచారం నడుస్తోంది. కొద్ది రోజులుగా తెలంగాణ కాంగ్రెస్ లో కొండా సురేఖ ఫ్యామిలీ కాక రేపిన సంగతి తెలిసిందే. సురేఖ అసంతృప్తి వ్యాఖ్యలు చేయగా.. ఆమె కుమార్తె సుస్మిత పటేల్ మరో అడుగు ముందుకు వేసి తెలంగాణ సీఎం రేవంత్ ను టార్గెట్ చేసుకున్నారు. టిపిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ను లక్ష్యంగా చేసుకుని వ్యక్తిగత విమర్శలు చేశారు. దీంతో పార్టీ క్రమశిక్షణ కమిటీ సురేఖకు నోటీసులు జారీ చేసింది. అయితే దీనిపై పెద్దగా స్పందించని సురేఖ… తిరిగి అదే క్రమశిక్షణ కమిటీకి లేఖ రాయడం సంచలనంగా మారింది.

బీసీ సెంటిమెంట్..
అయితే ముప్పేట తనపై జరుగుతున్న దాడిని గమనించారు కొండా సురేఖ. అత్యంత వ్యూహాత్మకంగా బీసీ సెంటిమెంట్, సామాజిక న్యాయం అనే వస్త్రాలను బయటకు తీశారు. క్యాబినెట్ లో ఉన్న సీనియర్ బీసీ మహిళా నాయకురాలు అయిన తనపై.. దాదాపు 20 మందికి పైగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఉసిగొల్పి వేధింపులకు గురి చేస్తుంటే.. పార్టీ అధిష్టానం నిశ్శబ్దంగా వీక్షించడంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. తన కుమార్తె వ్యాఖ్యలు పూర్తిగా వ్యక్తిగతం. కుటుంబ సంబంధాలు ఉన్నంత మాత్రాన మరొకరి అభిప్రాయాలకు నన్ను బాధ్యురాలు చేయడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం అని మరోసారి స్పష్టం చేశారు. అయితే తాను ఒక క్యాబినెట్ మంత్రిగా ఉంటూ.. సీఎం రేవంత్ పై తన కుమార్తె చేసిన వ్యాఖ్యలను మాత్రం ఆమె ఖండించడం లేదు. బీసీ కార్డును ప్రయోగించి.. తనపై చర్యలు తీసుకుంటే బీసీ వర్గాల్లో వ్యతిరేకత వస్తుందని సంకేతాన్ని హైకమాండ్కు పంపించారు. పైగా తనను ఎవరూ ఏం చేయలేరని చెప్పే ప్రయత్నం కూడా చేశారు.

రాజకీయ పార్టీల విముఖత..
ఒకవేళ కాంగ్రెస్ పార్టీ వేటు వేస్తే కొండా సురేఖ ఏ పార్టీలో చేరుతారు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. అయితే ఇప్పటికే ఆమె చాలా పార్టీలు తిరిగారు. గతంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో పని చేశారు. ఆ పార్టీ నాయకత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. తర్వాత కెసిఆర్ పంచన చేరారు. అక్కడ మంత్రి పదవి అందుకొని అదే కెసిఆర్ ను వ్యతిరేకించారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరి రేవంత్ రెడ్డి ద్వారా మంత్రి పదవి అందుకున్నారు. ఇప్పుడు ఆయనపై సైతం తిరుగుబాటు చేశారు. వివాదాస్పద ముద్ర ఉండడంతో కొండా ఫ్యామిలీ పట్ల తెలంగాణ రాజకీయ పార్టీలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు.

ఉపేక్షించే అవకాశం లే..
ఇంకోవైపు సురేఖ బీసీ కార్డు ఎంతవరకు పనిచేస్తుంది అనేది ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో జరుగుతున్న చర్చ. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకున్నారు సురేఖ కుమార్తె. సీఎం సోదరుడికి భూముల కేటాయింపులపై కూడా వ్యాఖ్యానించారు. అమ్ముడు పోయారు అంటూ టిపిసిసి చీఫ్ ఫై విరుచుకుపడ్డారు.. అందుకే ఆమె విషయంలో బీసీ ఎమ్మెల్యేలు సైతం ఆగ్రహంగా ఉన్నారు. బ్రిటన్ పర్యటన ముగించుకొని హైదరాబాద్ చేరుకున్న రేవంత్ ఈ అంశంపై సీరియస్ గా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ హై కమాండ్ తీవ్ర నిర్ణయం తీసుకుంటే.. అదే స్థాయిలో నష్టం చేయాలన్న ఆలోచనలో కొండా వర్గం ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు