Homeతెలంగాణవిద్యుత్ కోతలపై రైతుల ఆగ్రహం..!

విద్యుత్ కోతలపై రైతుల ఆగ్రహం..!

క్రైమ్ మిర్రర్,కోదాడ:- విద్యుత్‌ కోతల కారణంగా వరి పంటలు ఎండిపోతున్నాయని ఆరోపిస్తూ అఖిలపక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో రైతులు కోదాడ సబ్‌స్టేషన్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. పంటలు కీలక దశలో ఉన్న సమయంలో విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా రైతు సంఘాల నాయకులు మాట్లాడుతూ.. వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేసి ఎండిపోతున్న పంటలను కాపాడాలని డిమాండ్‌ చేశారు. విద్యుత్‌ కోతల కారణంగా పంటలు ఎండిపోయి నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.30 వేల చొప్పున నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. విద్యుత్‌ సరఫరాలో కోతలు విధించడం వల్ల బోర్లు, వ్యవసాయ మోటార్లు పనిచేయక వరి పొలాలకు సాగునీరు అందడం లేదని తెలిపారు.

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గంలో రైతులకు 24 గంటల విద్యుత్‌ సరఫరా చేస్తున్నప్పుడు కోదాడ ప్రాంత రైతుల పట్ల పక్షపాతం ఎందుకు చూపుతున్నారని ప్రభుత్వాన్ని రైతులు ప్రశ్నించారు. తమకు కూడా నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా చేసి పంటలను కాపాడాలని డిమాండ్‌ చేశారు.ధర్నా సందర్భంగా రైతులు ట్రాక్టర్లను సబ్‌స్టేషన్‌ వద్దకు తీసుకొచ్చి ప్రధాన మార్గంలో నిలిపి నిరసన తెలిపారు. ఉద్యోగులు సబ్‌స్టేషన్‌లోకి వెళ్లకుండా ట్రాక్టర్లను అడ్డుపెట్టి తమ నిరసనను వ్యక్తం చేశారు. విద్యుత్‌ కోతల సమస్యను వెంటనే పరిష్కరించకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని రైతు సంఘాల నాయకులు హెచ్చరించారు.

తల్లిదండ్రుల కళ్లముందే విషాదం.. స్కూల్ వ్యాన్ ఢీకొని బాలుడు మృతి

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు