Homeరాజకీయంతాతగా మెప్పించిన సీఎం రేవంత్.. వంటగదిలో పూరీలు వేసిన వీడియో

తాతగా మెప్పించిన సీఎం రేవంత్.. వంటగదిలో పూరీలు వేసిన వీడియో

రాష్ట్ర పరిపాలనలో నిత్యం బిజీగా ఉండే రేవంత్ రెడ్డి మరోసారి తన కుటుంబానికి కేటాయించిన సమయంతో అందరి మనసులు గెలుచుకున్నారు. ప్రజా కార్యక్రమాలు, రాజకీయ సమావేశాలతో తీరిక లేకుండా గడిపే ఆయన.. ఈసారి తన మనవడి కోరిక కోసం వంటగదిలోకి అడుగుపెట్టారు.
“తాతా.. నువ్వు పూరీలు వేస్తేనే తింటా” అని మనవడు అడగగానే.. వెంటనే స్పందించిన సీఎం స్వయంగా గరిట పట్టి పూరీలు తయారు చేశారు. ఈ మధుర క్షణాలను ఆయన సోషల్ మీడియా వేదికగా పంచుకోవడంతో వీడియో వేగంగా వైరల్ అవుతోంది.

వీడియోలో కనిపించిన దృశ్యాల ప్రకారం, సీఎం రేవంత్ రెడ్డి తన మనవడిని పక్కన కూర్చోబెట్టుకుని ఎంతో ప్రేమగా పిండి కలిపి పూరీలు చేసారు. చపాతీ పీటపై పిండిని చాపుతూ.. “ఇంకెన్ని పూరీలు కావాలి?”, “గుండ్రంగా వచ్చాయా లేదా?” అంటూ సరదాగా మనవడితో మాట్లాడటం ఆకట్టుకుంది.

తర్వాత వేడి నూనెలో పూరీలు వేస్తూ, కుటుంబంతో గడిపిన ఈ చిన్న సమయాన్ని ఎంతో ఆనందంగా మార్చుకున్నారు. ఈ వీడియోకు ఆయన పెట్టిన క్యాప్షన్ కూడా హృదయాన్ని హత్తుకునేలా ఉంది. బిజీ జీవితంలో ఇలా కుటుంబంతో గడిపే క్షణాలే అసలైన ఆనందమని తెలియజేశారు.
ప్రజా జీవితంలో ఎంత బిజీగా ఉన్నా.. కుటుంబానికి సమయం కేటాయించడం ఎంత ముఖ్యమో ఈ ఘటన ద్వారా మరోసారి స్పష్టమైంది. సీఎం ఈ సింపుల్ క్షణాలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.

also read: రూ.4,000 కోట్ల ‘రామాయణం’ .. రూ.250 కోట్ల డీల్ !

తాజావార్తలు