Homeఆంధ్ర ప్రదేశ్రాష్ట్రంలో వరల్డ్ క్లాస్ స్పోర్ట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్...! మంత్రి నారా లోకేష్‌

రాష్ట్రంలో వరల్డ్ క్లాస్ స్పోర్ట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్…! మంత్రి నారా లోకేష్‌

అమరావతి, క్రైమ్ మిర్ర‌ర్‌: రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి వరల్డ్ క్లాస్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు జెఎస్ డబ్ల్యు సంస్థ ముందుకు వచ్చిందని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. కామన్ వెల్త్, ఆసియా గేమ్స్ క్రీడల్లో పాల్గొనేందుకు ఎంపికైన ఎలైట్ ప్లేయర్స్ తో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఉండవల్లి నివాసంలో శుక్రవారం రాత్రి డిన్నర్ మీట్ నిర్వహించారు. ఆద్యంతం ఆహ్లాదంగా సాగిన ఈ సమావేశంలో రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై క్రీడాకారుల నుంచి సలహాలను స్వీకరించారు.

Also Read:మూగబోయిన 5 దశాబ్దాల ఉద్యమ గళం.. ఖమ్మంలో కన్నుమూసిన ‘అరుణోదయ’ నాగన్న!!

క్రీడాకారుల కుటుంబ నేపథ్యం, ప్రారంభంలో వారు ఎదుర్కొన్న సవాళ్లు, ప్రస్తుతం ప్రభుత్వం నుంచి అందుతున్న ప్రోత్సాహం వంటి వాటిపై క్రీడాకారులను వాకబుచేశారు. పలువురు క్రీడాకారులు మాట్లాడుతూ… గతంలో ఆంధ్రప్రదేశ్ లో మంచి కోచ్ లు ఉండేవారని, 2019లో ప్రభుత్వం మారాక వారందరినీ తొలగించారని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అప్పట్లో గుంటూరులో చంద్రబాబుగారు విదేశీ కోచ్ లతో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కూడా ఏర్పాటుచేశారని అన్నారు. దీనిపై మంత్రి లోకేష్ స్పందిస్తూ…

Also Read:క‌డ‌ప స్టీల్ ప్లాంట్‌కు శ్రీ‌కారం…! మారుతోన్న రాయ‌ల్ సీమ‌…

పాలకులు మారినా పాలసీలు మారకూడదన్నారు. క్రీడాకారులకు అత్యుత్తమ శిక్షణ ఇచ్చేందుకు ప్రపంచస్థాయి అత్యుత్తమ కోచ్ లను ఏపీలో ఏర్పాటుచేసి, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ తీసుకొస్తామని అన్నారు. రాష్ట్ర అత్యుత్తమ క్రీడా మౌలిక సదుపాయాల కల్పనకు జెఎస్ డబ్ల్యు సంస్థ అంగీకారం తెలిపింది. ఇందుకు అవసరమైన ఫ్రేమ్ వర్క్ సిద్ధం చేస్తున్నామని చెప్పారు. ఆస్ట్రేలియాలో గ్రిఫిత్ యూనివర్సిటీ విద్యతో క్రీడలకు ప్రత్యేక శిక్షణ అందిస్తోందని తెలిపారు. అక్కడ కరిక్యులమ్‌ను అథ్లెటిక్స్‌కు అనుగుణంగా రూపొందించారని అన్నారు.

Also Read:కవిత కొత్తపార్టీకి ఈసీ షాక్.. TRS పేరు మార్చాలని ఆదేశాలు!!

రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషిచేస్తోందని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. స్పోర్ట్స్ ట్రైనింగ్ అండ్ ఎడ్యుకేషన్ పై ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నామని అన్నారు. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ క్రికెట్ తో పాటు ఇతర క్రీడలను ప్రోత్సహిస్తోందని చెప్పారు. రాష్ట్రంలో స్పోర్ట్స్
ఎకోసిస్టమ్ అభివృద్ధికి తాము పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో స్పోర్ట్స్ ఎరెనా ఉండాలన్నది తమ అభిమతంగా పేర్కొన్నారు. స్పోర్ట్స్ ను ప్రోత్సహించడంపై తల్లిదండ్రుల్లో కూడా అవేర్ నెస్ రావాల్సి ఉందని అన్నారు. ఇందులో భాగంగానే గతఏడాది నిర్వహించిన డీఎస్సీలో తొలిసారిగా క్రీడాకారులకు 3శాతం రిజర్వేషన్ అమలుచేశామని చెప్పారు.

Also Read:మద్యం సేవించి ఇంటికి వచ్చిన తండ్రికొడుకులు.. ఇంతలోనే ఊహించని షాక్..!

గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు క్రీడల అభివృద్ధి కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. మహిళా క్రీడాకారులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందజేస్తున్నామని అన్నారు. విశాఖ క్రికెట్ స్టేడియంలో ఒక స్టాండ్ కు భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీరాజ్ పేరుపెట్టామని చెప్పారు. ప్రభుత్వ స్కూళ్లలో ప్రతి శనివారం నో బ్యాగ్ డేగా ప్రకటించి విద్యార్థుల ఆసక్తిమేరకు వారిని క్రీడల్లో ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు