అయోధ్య రామాలయంలో విరాళాల చోరీకి సంబంధించిన కేసుపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. కేసు దర్యాప్తును వేగంగా పూర్తి చేయాలని ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT)ను ధర్మాసనం ఆదేశించింది.
దర్యాప్తు ప్రక్రియలో నాణ్యత, పారదర్శకత మరింత మెరుగుపడేలా వచ్చే సూచనలను SIT నిష్పక్షపాతంగా పరిశీలించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దర్యాప్తు పూర్తయిన తర్వాత సమగ్ర నివేదికను సీల్డ్ కవర్‌లో సమర్పించాలని ఆదేశించింది.
అలాగే కేసు దర్యాప్తులో ఫోరెన్సిక్ ఆడిటర్‌ను భాగస్వామ్యం చేయాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి ధర్మాసనం సూచించింది. విరాళాలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, ఇతర అంశాలను సమగ్రంగా పరిశీలించేందుకు ఫోరెన్సిక్ ఆడిట్ ఉపయోగపడుతుందని కోర్టు పేర్కొంది.
ఈ కేసు దర్యాప్తు కోసం ఐజీపీ కిరణ్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేశారు. తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో ఈ కేసు దర్యాప్తు మరింత వేగవంతం కానుంది.
also read: సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ షంసు బీబీ దారుణ హత్య..
