Homeఅంతర్జాతీయంసోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ షంసు బీబీ దారుణ హత్య..

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ షంసు బీబీ దారుణ హత్య..

పాకిస్థాన్‌లో ప్రముఖ టిక్‌టాక్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ షంసు బీబీ (28) అలియాస్ అయేషా గిలామనా దారుణ హత్యకు గురయ్యారు. సోషల్ మీడియాలో భారీగా ఫాలోయింగ్ ఉన్న ఆమె హత్య స్థానికంగా కలకలం రేపింది.

అయేషా హత్యకు సంబంధించి ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. డబ్బు లావాదేవీల విషయంలో ఇద్దరు వ్యక్తులతో ఆమెకు కొంతకాలంగా విభేదాలు ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. ఈ కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఈ ఘటనలో అయేషా సోదరి కూడా గాయపడినట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి హత్యకు గల కారణాలు, నిందితుల పాత్రపై విచారణ కొనసాగిస్తున్నారు.

అయేషాకు టిక్‌టాక్‌లో సుమారు 13 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. సోషల్ మీడియాలో ఆమెకు పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నప్పటికీ, అంత్యక్రియలకు మాత్రం తక్కువ సంఖ్యలో ప్రజలు హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది.

అయేషా హత్యకు దారితీసిన అసలు కారణాలు, డబ్బు లావాదేవీల వ్యవహారంలో ఉన్న వ్యక్తుల పాత్రపై పోలీసుల దర్యాప్తు పూర్తయిన తర్వాత మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

also read: హనీమూన్‌లో దారుణం.. పీరియడ్స్ వచ్చాయని భార్యపై భర్త దాడి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు