Homeజాతీయంనెస్లే డెయిరీ వైటనర్‌పై FSSAI కీలక ఆదేశాలు.. విక్రయాలు నిలిపివేత

నెస్లే డెయిరీ వైటనర్‌పై FSSAI కీలక ఆదేశాలు.. విక్రయాలు నిలిపివేత

నెస్లే ఇండియాకు చెందిన లో-ఫ్యాట్ డెయిరీ వైటనర్‌ విక్రయాలపై ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) కీలక ఆదేశాలు జారీ చేసింది. న్యూఢిల్లీలోని ఓ హోటల్‌ నుంచి సేకరించిన ఈ ఉత్పత్తి నమూనాను ప్రయోగశాలలో పరీక్షించగా.. నిర్దేశిత నాణ్యత, ఆహార భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా లేదని తేలినట్లు FSSAI వెల్లడించింది.

పరీక్షల అనంతరం సంబంధిత ఉత్పత్తిని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్‌-2006 నిబంధనల ప్రకారం ‘నాన్‌-కంప్లయింట్‌’గా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. దీంతో సదరు హోటల్‌ యాజమాన్యానికి నోటీసులు జారీ చేసి, ఉత్పత్తి విక్రయాలను వెంటనే నిలిపివేయాలని ఆదేశించారు.

ఈ వ్యవహారంపై నెస్లే ఇండియా స్పందించింది. తమ ఉత్పత్తి సురక్షితమైనదేనని కంపెనీ స్పష్టం చేసింది. ఉత్పత్తి నాణ్యత, భద్రతకు సంబంధించి తాము నిర్దేశిత ప్రమాణాలను పాటిస్తున్నామని తెలిపింది.

అయితే FSSAI నిర్వహించిన నమూనా పరీక్షలో వచ్చిన ఫలితాల ఆధారంగా ప్రస్తుతం విక్రయాలను నిలిపివేయాలంటూ ఆదేశాలు వెలువడ్డాయి. ఈ పరిణామంతో నెస్లేకు చెందిన డెయిరీ వైటనర్‌ ఉత్పత్తిపై చర్చ మొదలైంది. అధికారులు వెల్లడించిన పరీక్షా ఫలితాలు, కంపెనీ వివరణ మధ్య ఉన్న అంశాలు ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

also read: తెలంగాణ విద్యార్థులకు దసరా సెలవుల తేదీలు ఖరారు.. స్కూళ్లు, కాలేజీలకు వేర్వేరు డేట్స్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు