Homeక్రైమ్కట్టెల తరలింపునకు లంచం.. అటవీ శాఖ అధికారులపై ఏసీబీ కొరడా

కట్టెల తరలింపునకు లంచం.. అటవీ శాఖ అధికారులపై ఏసీబీ కొరడా

క్రైమ్ మిర్రర్ : అవినీతి అధికారులపై ఏసీబీ అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. వరుస దాడులతో లంచగొండి అధికారులకు షాక్ ఇస్తున్న ఏసీబీ తాజాగా నాగర్‌కర్నూల్ జిల్లాలో అటవీ శాఖ అధికారులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. లింగాల అటవీ శాఖ కార్యాలయంలో రూ.50 వేల లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుబడినట్లు సమాచారం.

కట్టెల తరలింపునకు లంచం డిమాండ్

నల్లమల అటవీ ప్రాంతం నుంచి కట్టెలను తరలిస్తున్న కొందరు వ్యక్తుల నుంచి అటవీ శాఖ అధికారులు లంచం డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే బాధితులు రూ.50 వేల వరకు చెల్లించినప్పటికీ మరింత డబ్బు ఇవ్వాలని అధికారులు ఒత్తిడి చేసినట్లు సమాచారం. అధికారుల వేధింపులు ఎక్కువ కావడంతో బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు ఆధారంగా అధికారులు పక్కా ప్రణాళిక రూపొందించారు.

రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ

ప్రణాళికలో భాగంగా లింగాల అటవీ శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. బాధితుల నుంచి రూ.50 వేల లంచం తీసుకుంటున్న సమయంలో సంబంధిత అధికారులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు సమాచారం. లంచంగా తీసుకున్న నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కార్యాలయంలో సోదాలు నిర్వహించిన అనంతరం సంబంధిత అటవీ శాఖ అధికారులపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నిందితులను విచారిస్తున్న ఏసీబీ అధికారులు.. లంచం డిమాండ్‌ చేయడానికి గల కారణాలు, ఈ వ్యవహారంలో మరెవరైనా అధికారుల పాత్ర ఉందా? అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు