పాకిస్థాన్ మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ బాసిత్ అలీ తీవ్ర గుండెపోటుకు గురయ్యారు. సోమవారం ఆయనకు ఛాతిలో తీవ్రమైన అసౌకర్యం తలెత్తడంతో కుటుంబ సభ్యులు వెంటనే కరాచీలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. వైద్యులు పరీక్షలు నిర్వహించిన అనంతరం యాంజియోప్లాస్టీ చేసినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం బాసిత్ అలీ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం. వైద్యుల పర్యవేక్షణలో ఆయనకు చికిత్స కొనసాగుతోంది. విషయం తెలుసుకున్న క్రికెట్ అభిమానులు, మాజీ ఆటగాళ్లు, క్రికెట్ వర్గాలు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.
బాసిత్ అలీ పాకిస్థాన్ తరఫున 1993 నుంచి 1996 మధ్య అంతర్జాతీయ క్రికెట్ ఆడారు. ఆయన 19 టెస్టులు, 50 వన్డేల్లో ప్రాతినిధ్యం వహించి మొత్తం 69 అంతర్జాతీయ మ్యాచ్‌లలో 2,123 పరుగులు సాధించారు. ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత క్రికెట్ విశ్లేషకుడిగా, కామెంటేటర్‌గా కొనసాగుతున్నారు.
బాసిత్ అలీ ఆరోగ్య పరిస్థితిపై మరిన్ని వివరాలు వైద్యుల నుంచి అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.
also read: ‘రామాయణం’ బడ్జెట్‌పై హీరో యష్ క్లారిటీ.. రూ.4 వేల కోట్లు దేనికి అంటే?
