Homeక్రైమ్తండ్రి చేతిలో కుమారుడి దారుణ హత్య.. తీజ్‌ వేడుకల్లో విషాదం

తండ్రి చేతిలో కుమారుడి దారుణ హత్య.. తీజ్‌ వేడుకల్లో విషాదం

నల్గొండ జిల్లా చందంపేట మండలం వెంకటిగాని తండాలో సోమవారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహం ఓ యువకుడి ప్రాణాలను బలిగొంది. తండ్రి దాడిలో 25 ఏళ్ల యువకుడు మృతి చెందాడు.

స్థానికుల సమాచారం ప్రకారం.. తీజ్‌ పండుగ సందర్భంగా తండ్రి, కుమారుడి మధ్య ఏదో విషయంపై వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో గొడవ తీవ్ర రూపం దాల్చడంతో తండ్రి రోకలిబండతో కుమారుడు మాకట్‌లాల్‌పై దాడి చేసినట్లు తెలుస్తోంది.

ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన మాకట్‌లాల్‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఘటనతో తండాలో విషాద వాతావరణం నెలకొంది. కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తండ్రి, కుమారుడి మధ్య గొడవకు దారితీసిన కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

also read: ప్రహరీ గోడ కూలి విద్యార్థి మృతి….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు