పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వ పాఠశాలలో ప్రహరీ గోడ అకస్మాత్తుగా కూలిపోవడంతో పదో తరగతి చదువుతున్న 15 ఏళ్ల విద్యార్థి అరుణ్ తేజ మృతి చెందాడు.
పాఠశాల ఆవరణలో అనూహ్యంగా గోడ కూలడంతో విద్యార్థులు, సిబ్బంది ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో అరుణ్ తేజ తీవ్రంగా గాయపడగా.. ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.
విద్యార్థి మృతితో పాఠశాలలో విషాద వాతావరణం నెలకొంది. కుమారుడి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఘటనపై సంబంధిత అధికారులు వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రహరీ గోడ కూలడానికి గల కారణాలు, గోడ నిర్మాణ పరిస్థితిపై అధికారుల విచారణలో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
also read: ముజఫర్‌నగర్ కోర్టులో సంచలన తీర్పులు.. 4 నెలల్లో 22 మందికి మరణశిక్ష!
