హైదరాబాద్, క్రైమ్‌మిర్రర్: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హైదరాబాద్-చెన్నై, హైదరాబాద్-బెంగళూరు బుల్లెట్ రైలు కారిడార్ల ప్రాజెక్టులో కీలక అడుగు పడింది. నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ పర్యవేక్షణలో తెలంగాణలోని రంగారెడ్డి, నల్గొండ, వికారాబాద్ జిల్లాల పరిధిలో క్షేత్రస్థాయి (గ్రౌండ్) సర్వే ప్రక్రియ వేగంగా సాగుతోంది. ఈ కారిడార్ల మార్గాన్ని ఖరారు చేసేందుకు సర్వే బృందాలు క్లిష్టమైన కసరత్తును నిర్వహిస్తున్నాయి.ఈ సర్వేలో భాగంగా రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని కురుమిద్ద, మేడిపల్లి, మంకీస్‌గూడెం, చింతపట్ల వంటి పలు గ్రామాల్లోని పొలాలు, ఖాళీ స్థలాలలో ఎరుపు, తెలుపు రంగులతో ప్రత్యేక మార్కింగ్‌ల ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది.
Also Read:Kayadu Lohar: క్యూట్ బ్యూటీకి క్రేజీ ఆఫర్.. ఏకంగా సూర్య మూవీలో ఛాన్స్!
హైదరాబాద్-చెన్నై కారిడార్ శంషాబాద్, యాచారం మీదుగా నల్గొండ జిల్లా నాంపల్లి వైపు, అలాగే హైదరాబాద్-బెంగళూరు కారిడార్ శంషాబాద్, షాబాద్ మండలాల మీదుగా సాగేలా ప్రాథమిక ప్రణాళికలు సిద్ధం చేశారు.ఇప్పటికే ఈ హైస్పీడ్ రైలు మార్గాలకు సంబంధించి ఏరియల్ సర్వే విజయవంతంగా ముగిసింది. ప్రస్తుతం జరుగుతున్న క్షేత్రస్థాయి గ్రౌండ్ సర్వే పూర్తిగా పూర్తయితే, ప్రాజెక్టుకు సంబంధించిన తుది ఎలైన్‌మెంట్, బుల్లెట్ రైలు స్టేషన్లు ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలనే లొకేషన్లు, భవిష్యత్తులో అవసరమయ్యే భూసేకరణ పరిధిపై పూర్తి స్పష్టత రానుంది. ఈ ప్రాజెక్ట్ అందుబాటులోకి వస్తే హైదరాబాద్ నుంచి చెన్నై, బెంగళూరు నగరాలకు ప్రయాణ సమయం కేవలం 2 నుండి 3 గంటలకు తగ్గిపోనుంది
Also Read:New Fuel Rules: ఇక కావాల్సినంత పెట్రోల్, డీజిల్.. కేంద్రం గుడ్ న్యూస్!