-
అమరావతిలో ఊపందుకున్న రియల్ ఎస్టేట్…
విజయవాడ, క్రైమ్ మిర్రర్:ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో రియల్ ఎస్టేట్ రంగానికి మళ్లీ అద్భుతమైన పూర్వవైభవం వచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి నిర్మాణ పనులను దాదాపు రూ. 48 వేల కోట్లతో వేగవంతం చేయడం, ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ నిధుల విడుదల వంటి సానుకూల పరిణామాలు మార్కెట్‌కు కొత్త బూస్ట్ ఇచ్చాయి. రిటర్నబుల్ రెసిడెన్షియల్, కమర్షియల్ ప్లాట్ల ‘రీ-సేల్’ లావాదేవీలు ప్రస్తుతం రికార్డు స్థాయిలో ఊపందుకున్నాయి.రాజధాని కోర్ ఏరియా పరిధిలోకి వచ్చే తుళ్లూరు, మంగళగిరి, మందడం, వెలగపూడి పరిసర ప్రాంతాల్లోని భూములకు ఇప్పుడు ఇన్వెస్టర్ల నుంచి భారీ డిమాండ్ ఏర్పడింది. ఒకప్పుడు వెలవెలబోయిన సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలు ఇప్పుడు కొనుగోలుదారులు, రియల్టర్ల డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లతో నిత్యం హడావుడిగా మారుతున్నాయి.
Also Read:Nabha Natesh: నటిగా మంచి సంతృప్తిని ఇచ్చాయి.. నభా నటేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
ముఖ్యంగా తుళ్లూరు పరిసరాల్లో ఐదేళ్ల క్రితం చదరపు గజం రూ. 12,000 నుంచి రూ. 15,000 పలికిన సీఆర్డీయే ప్లాట్ల ధరలు, ఇప్పుడు డిమాండ్‌ను బట్టి గజం రూ. 35,000 నుండి ఏకంగా రూ. 55,000 మార్కును తాకాయి. పక్కా లీగల్ క్లియరెన్స్, ప్రభుత్వ గుర్తింపు ఉండటంతో హైదరాబాద్, బెంగళూరు సహా ఎన్‌ఆర్ఐ ఇన్వెస్టర్లు ఇక్కడి ప్లాట్లను కొనుగోలు చేయడానికి పోటీ పడుతున్నారు.రాజధాని కోసం నాడు భూములిచ్చిన రైతులకు సీఆర్డీయే ఇటీవలే వీధిపోట్లు, వాస్తు లోపాలు లేని ప్లాట్లను లాటరీ ద్వారా కేటాయించి ప్రొవిజనల్ సర్టిఫికెట్లు అందజేసింది. ల్యాండ్ పూలింగ్ ప్లాట్ల తొలి విడత రిజిస్ట్రేషన్లకు ప్రభుత్వం ఎటువంటి ఫీజు వసూలు చేయకపోవడంతో రైతులు వేగంగా ప్రక్రియ ముగిస్తున్నారు. అలా రిజిస్ట్రేషన్ పూర్తయిన ప్లాట్లను సొంత అవసరాల కోసం, ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా రైతులు ఓపెన్ మార్కెట్‌లో విక్రయిస్తుండటంతో క్రయవిక్రయాల సర్కిల్ వేగంగా తిరుగుతోంది. టైటిల్ పక్కాగా ఉండటం, మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుండటంతో ఎలాంటి లీగల్ రిస్క్ లేని ఈ ప్లాట్లను కొనేందుకు బయ్యర్లు ఎగబడుతున్నారు.
Also Read:యూరప్‌లో తీవ్ర ఉష్ణతరంగం… ప్రాణాలను బలి తీసుకుంటున్న వేడి!
మరో వైపు ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఇందుకు పూర్తి భిన్నమైన, విచిత్రమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. సొంత యువత భవిష్యత్తు కోసం, పక్క రాష్ట్రాల రాజధానులపై ఆధారపడే అవసరం లేకుండా ప్రభుత్వం ఎంతో ప్రణాళికాబద్ధంగా నిర్మిస్తున్న సొంత రాజధాని అమరావతిపై.. సొంత రాష్ట్రానికి చెందిన వారే కుట్రలు చేయడం, దాన్ని కొంతమంది సమర్థించడం నవ్యాంధ్రకు పట్టిన పెద్ద దౌర్భాగ్యం. ఈ వైఖరి ఎలా ఉందంటే.. “నా కన్ను పోయినా పర్వాలేదు.. ఎదుటివారికి శకునం కాకూడదు” అన్న చందంగా, మన కొంపను మనమే తగులబెట్టుకున్నట్లు ఉంది. “వ్యక్తిగతంగా మాకు ఎలాంటి లాభం లేదు కాబట్టి, అమరావతితో మాకేం పని?” అని భావించే కొంతమంది అమాయకులను, స్వార్థపరులను అడ్డం పెట్టుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, దాని అనుకూల శక్తులు కుట్రలకు తెరలేపుతున్నాయిఐదేళ్ల కాలంలో జగన్ మోహన్ రెడ్డి అమరావతిని పూర్తిగా పాడుబెట్టి, ఒక అడవిలా మార్చేసిన వైనాన్ని రాష్ట్రం చూసింది.
Also Read:హైదరాబాద్ ట్రాఫిక్ అలర్ట్: జులై 1 నుంచి ఐఐఐటీ జంక్షన్ వద్ద భారీ ఆంక్షలు – మూడు నెలలపాటు రోడ్ మూసివేత
ఆ ‘జంగిల్’ క్లియర్ చేయడానికే కొత్త ప్రభుత్వానికి దాదాపు ఆరు నెలల కాలం పట్టిందంటే విధ్వంసం ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఆ అవరోధాలన్నింటినీ దాటుకుని, గత ఏడాదిన్నర కాలంగా శ్రమించి రాజధాని పనులను మళ్లీ పట్టాలెక్కించిన తరుణంలో.. ఇప్పుడు మళ్లీ బెంగళూరు వేదికగా కుట్రల పర్వం ప్రారంభం కావడం ఘోరం. రాజధాని అనేది కేవలం ఒక ప్రాంతానికి సంబంధించిన భూముల వ్యవహారం కాదు. అది కోట్లాది మంది ఆంధ్రుల ఆత్మగౌరవం, రాబోయే తరాల ఉపాధి కేంద్రం. ఇటువంటి మహోన్నత ప్రాజెక్టును రాజకీయ కక్ష సాధింపుల కోసం దెబ్బతీయాలని చూడటం రాష్ట్ర ద్రోహమే అవుతుంది.