హైదరాబాద్, క్రైమ్‌మిర్రర్: హైదరాబాద్ నగరవాసులకు గుడ్‌న్యూస్. పాతబస్తీ పరిధిలోని చంచల్‌గూడ నుంచి సంతోష్‌నగర్ వరకు జీహెచ్‌ఎంసీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్టీల్ బ్రిడ్జి పనులన్నీ దాదాపుగా పూర్తయ్యాయి. రూ.620 కోట్ల అంచనా వ్యయంతో 3.32 కిలోమీటర్ల పొడవున 85 పిల్లర్లతో ఈ వంతెనను నిర్మించారు. ఈ మార్గంలో ప్రధాన పనులైన బిటుమినస్ కాంక్రీట్ రోడ్డు నిర్మాణం పూర్తి కాగా.. మరో నెల రోజుల్లో దీనిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి బల్దియా వేగంగా అడుగులు వేస్తోంది. గతంలో భూసేకరణ, కరోనా లాక్‌డౌన్, నిధుల కొరత వల్ల ఈ ప్రాజెక్టు ఆలస్యమైనప్పటికీ.. ప్రస్తుతం పనులు పూర్తి చేసుకోని ప్రారంభానికి సిద్ధమైంది.
Also Read:“ఫుట్‌పాత్‌పై వాయిలిన్‌తో పోరాటం… 80 ఏళ్ల కళాకారుడి జీవితాన్ని మార్చబోతున్న ఆనంద్ మహీంద్ర!”
హైదరాబాద్ నగర ప్రజలకు, ముఖ్యంగా పాతబస్తీ పరిధిలోని సంతోష్‌నగర్, చంచల్‌గూడ, సైదాబాద్ పరిసర ప్రాంతాల వాహనదారులకు త్వరలోనే ట్రాఫిక్ కష్టాల నుంచి శాశ్వత విముక్తి లభించనుంది. చంచల్‌గూడ జైలు జంక్షన్ నుంచి సంతోష్‌నగర్ వైపు వెళ్లే ప్రధాన రహదారిపై జీహెచ్‌ఎంసీ చేపట్టిన ప్రతిష్టాత్మక సంతోష్‌నగర్ స్టీల్ బ్రిడ్జి పనులన్నీ దాదాపుగా ముగింపు దశకు చేరుకున్నాయి. మరో నెల రోజుల్లోనే ఈ వంతెనపై వాహనాలు రయ్యిరయ్యిన దూసుకెళ్లనున్నాయని జీహెచ్‌ఎంసీ అధికారులు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన మిగిలిన చిన్నపాటి అనుబంధ పనులను బల్దియా ఇంజినీరింగ్ విభాగం యుద్ధప్రతిపాదికన చకచకా పూర్తిచేస్తోంది.ఈ ప్రాజెక్టులో అత్యంత కీలకమైన పనులైన బ్రిడ్జిపై బిటుమినస్ కాంక్రీట్ రోడ్డు నిర్మాణాన్ని అధికారులు విజయవంతంగా పూర్తిచేయించారు.
Also Read:రైల్లో చెత్త వేస్తూ 8 గంటలు హంగామా.. సహనం కోల్పోయిన ప్రయాణికుడు చెప్పిన షాకింగ్ స్టోరీ!
ఈ విషయమై జీహెచ్‌ఎంసీ చీఫ్ ఇంజినీర్ సహాదేవ్ రత్నాకర్ శుక్రవారం మాట్లాడుతూ.. వంతెనకు సంబంధించిన సివిల్, రోడ్డు నిర్మాణ పనులు పూర్తయ్యాయని కేవలం చిన్నపాటి తుది మెరుగులు మాత్రమే మిగిలున్నాయని స్పష్టం చేశారు. వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం కింద రూ.620 కోట్ల భారీ వ్యయంతో 3.32 కిలోమీటర్ల పొడవున ఈ భారీ స్టీల్ వంతెనను నిర్మిస్తున్నారు. ఈ బ్రిడ్జి అందుబాటులోకి ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. సంతోష్ నగర్ నుంచి చంచల్‌గూడ ప్రయాణం కేవలం ఐదు నిమిషాల్లోనే ముగిసిపోతుంది. మొత్తం 85 పిల్లర్లపై ఈ అధునాతన స్టీల్ వంతెనను డిజైన్ చేశారు. ప్రస్తుతం బ్రిడ్జి పైన, కింద నిర్మించాల్సిన ర్యాంప్ పనులు, రక్షణ గోడ నిర్మాణం, జాయింట్ల విస్తరణ పనులతో పాటు బ్రిడ్జి కింద కాలిబాట గోడల నిర్మాణ పనులు పెండింగ్‌లో ఉన్నాయని వాటిని సైతం నెల రోజుల్లో పూర్తి చేస్తామని ఆయన వివరించారు.
Also Read:ప్రాణం తీసిన ఫొటో సరదా – గోవా బీచ్‌లో రాకాసి అలలకు యువకుడు బలి, వైరల్ వీడియో
సంతోష్‌నగర్, సైదాబాద్, ఐఎస్ సదన్ క్రాస్ రోడ్డు పరిధిలో ట్రాఫిక్ సమస్యను అధిగమించడానికి ఈ స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులకు 2018-19 ఆర్థిక సంవత్సరంలోనే అంకురార్పణ జరిగింది. అయితే, ప్రారంభమైన తర్వాత ఈ ప్రాజెక్టు అనేక ఆటంకాలను ఎదుర్కొని తీవ్రంగా ఆలస్యమైంది. దీనికి ప్రధాన కారణం పాతబస్తీలోని అత్యంత రద్దీ ప్రాంతాల గుండా ఈ బ్రిడ్జి వెళ్తుండటంతో.. భూసేకరణ ప్రక్రియ జీహెచ్‌ఎంసీకి కత్తిమీద సాములా మారింది. వందలాది ప్రైవేటు ఆస్తులు, దుకాణాల యజమానులతో సంప్రదింపులు జరిపి వారికి పరిహారం చెల్లించి భూములు సేకరించడానికి దాదాపు రెండేళ్లకు పైగా సమయం పట్టింది.దీనికి తోడు కరోనా మహమ్మారి, లాక్‌డౌన్ల కారణంగా పనులు పూర్తిగా స్తంభించిపోయాయి.
వలస కార్మికులు వారి స్వగ్రామాలకు తరలిపోవడం, స్టీల్ ముడిసరుకు కొరత ఏర్పడటం, మార్కెట్లో ఉక్కు ధరలు విపరీతంగా పెరగడంతో కాంట్రాక్ట్ సంస్థలు పనులను నత్తనడకన సాగించాయి. ఆ తదుపరి కాలంలో జీహెచ్‌ఎంసీలో ఏర్పడిన నిధుల కొరత, బిల్లుల చెల్లింపుల్లో జాప్యం, భూగర్భ డ్రైనేజీ మరియు తాగునీటి పైప్‌లైన్ల తరలింపు వంటి సాంకేతిక సమస్యల వల్ల కూడా ఈ బ్రిడ్జి ఏళ్ల తరబడి పెండింగ్‌లో పడింది. గత ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక శ్రద్ధ వహించి నిధులు విడుదల చేయడంతో ఎట్టకేలకు ఆరు సంవత్సరాల నిరీక్షణకు తెరదించుతూ వంతెన ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది.