Homeక్రైమ్తాండూరులో రైలులో గంజాయి అక్రమ రవాణా.. ముగ్గురు అరెస్ట్, 52.88 కిలోలు స్వాధీనం

తాండూరులో రైలులో గంజాయి అక్రమ రవాణా.. ముగ్గురు అరెస్ట్, 52.88 కిలోలు స్వాధీనం

రైలులో గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను ఎక్సైజ్ అధికారులు తాండూరులో అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 52.88 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.27 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.

పక్కా సమాచారంతో తనిఖీలు

ఒడిశా నుంచి మహారాష్ట్రకు గంజాయిని తరలిస్తున్నారన్న సమాచారం మేరకు ఎక్సైజ్ అధికారులు తాండూరులో తనిఖీలు చేపట్టారు. ఈ సమయంలో రైలులో గంజాయి తీసుకొచ్చిన ముగ్గురు వ్యక్తుల కదలికలను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఒడిశా నుంచి గంజాయిని తీసుకొచ్చి తాండూరులో రైలు దిగిన అనంతరం, అక్కడి నుంచి మహారాష్ట్రకు తరలించేందుకు వారు ఎదురుచూస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున..

గంజాయి తరలింపు కోసం నిందితులు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున ఒప్పందం చేసుకున్నట్లు ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు. బ్రీఫ్‌కేసుల్లో గంజాయి ప్యాకెట్లను ఉంచి తరలిస్తున్న సమయంలోనే వారిని పట్టుకున్నట్లు తెలిపారు.
ఈ కేసులో ఒడిశాకు చెందిన మధు ప్రధాన్ (34), సింబా సాహక్ (22), నీల్ మండల్ (22)లను అధికారులు అరెస్ట్ చేశారు. గంజాయి అక్రమ రవాణా వెనుక మరెవరైనా ఉన్నారా? ఈ వ్యవహారంలో ప్రధాన సూత్రధారులు ఎవరు? అనే కోణాల్లో అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

also read: టాటా సన్స్ చైర్మన్ పదవికి చంద్రశేఖరన్ రాజీనామా.. తదుపరి అధిపతి ఎవరనే ఉత్కంఠ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు