ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా కాజులూరు మండలం దుగ్గుదూరు గ్రామంలో కలుషితాహారం ఘటన కలకలం రేపింది. రహదారి పక్కన బండిపై విక్రయించిన బజ్జీలు తిన్న తర్వాత ఒక్కసారిగా 23 మంది అస్వస్థతకు గురైనట్టు సమాచారం. బజ్జీలు తిన్న కొద్ది సేపటికే బాధితులకు వాంతులు, విరేచనాలు ప్రారంభమైనట్లు గ్రామస్తులు చెబుతున్నారు. అస్వస్థతకు గురైన వారిని వెంటనే సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
వైద్యుల పర్యవేక్షణలో కొందరు ఇంకా చికిత్స పొందుతుండగా, మరికొందరు కోలుకుని డిశ్చార్జ్ అయినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై స్థానిక ఆరోగ్య సిబ్బంది అప్రమత్తమై పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఆహారం కలుషితమవడానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది. గ్రామంలో మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారని సమాచారం. ప్రజలు రహదారి పక్కన విక్రయించే ఆహార పదార్థాలను తీసుకునేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.
also read: కేరళలో విషాదం… ఇద్దరు చిన్నారులతో కలిసి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న భార్యాభర్తలు..