Homeక్రైమ్దాదర్ స్టార్ మాల్‌లో స్పా ముసుగులో వ్యభిచార దందా.. ఆరుగురు యువతులు అదుపులోకి

దాదర్ స్టార్ మాల్‌లో స్పా ముసుగులో వ్యభిచార దందా.. ఆరుగురు యువతులు అదుపులోకి

ముంబైలో స్పా ముసుగులో వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారనే ఆరోపణలపై పోలీసులు దాడి చేశారు. దాదర్‌లోని స్టార్ మాల్‌లో ఉన్న రెబల్ థాయ్ స్పాపై పోలీసులకు సమాచారం అందడంతో తనిఖీలు చేపట్టారు.

పోలీసుల దాడి సమయంలో స్పాలో ఉన్న 25 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న ఆరుగురు యువతులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ వ్యవహారంలో మహిళా బ్రోకర్‌తో పాటు స్పా మేనేజర్ సహా మొత్తం నలుగురిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.

స్పా నిర్వహణ పేరుతో అక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి, స్పా నిర్వాహకులు, మధ్యవర్తుల పాత్రపై విచారణ కొనసాగిస్తున్నారు.

also read: ఝాన్సీ హైవేపై ఘోర ప్రమాదం.. అతీక్ అహ్మద్ కుమారుడు అబాన్ మృతి

తాజావార్తలు