Homeక్రైమ్కేరళలో విషాదం... ఇద్దరు చిన్నారులతో కలిసి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న భార్యాభర్తలు..

కేరళలో విషాదం… ఇద్దరు చిన్నారులతో కలిసి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న భార్యాభర్తలు..

కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో హృదయ విదారక సంఘటన చోటు చేసుకుంది. ఆర్థిక ఇబ్బందులు తాళలేక నారాయణన్ తన అంధురాలైన భార్య, ఇద్దరు చిన్నపిల్లలతో కలిసి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ పరిస్థితులు దారుణంగా మారడంతో, ఇంటి అద్దె కూడా చెల్లించలేని పరిస్థితిలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

అయితే, నారాయణన్ ఇంటి అద్దె కూడా కట్టలేకపోతున్నామని సహాయం కోసం పోలీసులను ఆశ్రయించగా, పోలీసులు వారికి తాత్కాలికంగా ప్రత్యామ్నాయ వసతి కల్పించారు. పరిస్థితులు మారతాయని భావించిన ఈ కుటుంబం అంతలోనే ఆత్మహత్య చేసుకోవడంతో ఈ ఘటనపై అనుమానాలు రేకెత్తిస్తోంది.  జూన్ 25న పిరవం సమీపంలోని నదికి వెళ్లిన ఈ నలుగురు ఒక్కసారిగా నీటిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

ఈ విషాద ఘటనలో మృతదేహాల వెలికితీత కూడా క్రమంగా జరిగింది. శుక్రవారం తల్లి, రెండేళ్ల చిన్నారి మృతదేహాలు బయటపడగా, శనివారం తండ్రి మృతదేహం, ఆదివారం ఏడేళ్ల బాలిక మృతదేహం లభించాయి. ఒక్కో రోజు ఒక్కో మృతదేహం బయటపడటంతో ఈ ఘటన మరింత విషాదకరంగా మారింది.

ఇంకా దురదృష్టకరమైన విషయం ఏమిటంటే, జూన్ 28న ఈ కుటుంబం కొత్త నివాసానికి మారాల్సి ఉండగా, అంతలోనే ఈ విషాదం చోటుచేసుకోవడం అందరినీ కలచివేసింది. చివరి క్షణాల్లో వారికి ఏమి జరిగిందో అనేది ఇప్పటికీ స్పష్టంగా తెలియలేదు. ఈ ఘటనపై పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆర్థిక ఇబ్బందులే ఈ దారుణానికి కారణమా, లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో విచారణ కొనసాగుతోంది.

also read: ఫ్లాప్‌ల తర్వాత ఫైర్ మోడ్‌లో నితిన్… సింపుల్ లుక్‌తో సర్‌ప్రైజ్!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు