-
ఏపీ మాదిరిగానే రాజకీయం చేయాలన్న ఆలోచన
-
ముందుగా గ్రేటర్ పట్టు పెంచేందుకు ఆరాటం
-
తరువాత వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లపై..
-
అందుకే హైదరాబాద్ లో పార్టీ కార్యాలయం ప్రారంభం
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: పవన్ కళ్యాణ్ పక్క పొలిటికల్ స్కెచ్ తోనే తెలంగాణలో అడుగు పెట్టారా? పార్టీ కార్యాలయం ప్రారంభం వెనుక భారీ వ్యూహం దాగి ఉందా? అందుకే వరుసగా తెలంగాణలో పర్యటనలు చేస్తున్నారా? గ్రేటర్ లో సత్తా చాటుతారా? మిగతా కార్పొరేషన్ల ఎన్నికల్లో సైతం బరిలో దిగుతారా? నిర్ణయాత్మక శక్తిగా ఎదుగుతారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా ఇలానే ఉన్నాయి.
Also Read:జస్ట్ రూ.24లకే ఫుట్బాల్ లైవ్ వరల్డ్ కప్ మ్యాచ్లు
మారుతున్న రాజకీయ అడుగులు…
హైదరాబాదులో నూతనంగా ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని పవన్ ప్రారంభించారు. ఇటీవల జరిగిన నాటకీయ పరిణామాల నడుమ కార్యాలయం ప్రారంభోత్సవానికి భారీగా జనసైనికులు తరలివచ్చారు. ఒక వ్యూహం ప్రకారం ఇటీవల పవన్ కళ్యాణ్ చర్యలు తెలంగాణలో కనిపిస్తున్నాయి. మొన్న ఆ మధ్యన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు జరిగిన పరిణామాలు అందరికీ తెలిసిన విషయమే. తప్పకుండా జనసేన ను తెలంగాణలో విస్తరిస్తానని సవాల్ చేశారు పవన్. అటు తరువాత వరుసగా పర్యటనలు చేస్తున్నారు. హన్మకొండలో ఓ బాలుడిని పరామర్శించారు. వరంగల్ మహంకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. విజయవాడ వెళుతుండగా సూర్యాపేటలో పవన్ కళ్యాణ్ కు గ్రాండ్ వెల్కమ్ కూడా లభించింది. ఇటీవల తెలంగాణ వాదులతో సవాళ్లు విసిరిన పవన్ కళ్యాణ్.. కొద్ది రోజులకే తెలంగాణలో పార్టీని యాక్టివ్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Also Read:Folk Star Nagadurga: జానపద గాయని నుంచి హీరోయిన్గా.. నాగదుర్గ కొత్త ప్రయాణం!
ఆ కార్పొరేషన్లపై ఫోకస్…
త్వరలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నాయి. గ్రేటర్ ను మూడు కార్పొరేషన్లుగా విభజించిన సంగతి తెలిసిందే. వాటితో పాటు వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ లకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఐదు చోట్ల సత్తా చాటేందుకు పవన్ కళ్యాణ్ గట్టి ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా గ్రేటర్ లో సెటిలర్స్, ఉద్యోగులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో బరిలో దిగితే మంచి ఫలితాలు వస్తాయని భావిస్తున్నట్లు సమాచారం. అంతర్గతంగా అభ్యర్థుల ఎంపిక కోసం ఇప్పుడు ఈ కార్యాలయాన్ని ప్రారంభించినట్లు అర్థం అవుతోంది. ఏపీ మాదిరిగానే తెలంగాణలో సైతం సుదీర్ఘకాలం రాజకీయం చేసి పట్టు సాధించాలన్నది పవన్ కళ్యాణ్ ఆలోచన..
Also Read:జస్ట్ రూ.24లకే ఫుట్బాల్ లైవ్ వరల్డ్ కప్ మ్యాచ్లు
రాజకీయ శూన్యతను ఉపయోగించుకోవాలని…
గతంతో పోల్చుకుంటే ప్రత్యేక రాష్ట్ర సెంటిమెంట్ అనేది తెలంగాణలో సన్నగిల్లింది. అదే సమయంలో ఒక రకమైన రాజకీయ శూన్యత ఏర్పడింది. నవ తెలంగాణను పాలించే ఛాన్స్ ఇచ్చిన గులాబీ పార్టీ అవినీతిలో కూరుకుపోయింది. కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే కొన్ని వర్గాలకు ఆకట్టుకోలేకపోతోంది. భారతీయ జనతా పార్టీకి సరైన నాయకత్వం లేదు. ఈ పరిస్థితుల్లోనే ఏపీ మాదిరిగా సుదీర్ఘ రాజకీయం చేసిన నిలబడితే తెలంగాణ ప్రజలు కూడా ఆదరిస్తారని పవన్ కళ్యాణ్ ఒక అంచనాకు వచ్చారు. అందుకే అక్కడ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.