క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : తెలంగాణ సీఎం రేవంత్ సన్నిహితుడు వేం నరేందర్ రెడ్డి రాజ్యసభకు రాజీనామా చేస్తారా? మీనాక్షి నటరాజన్ కోసం ఈ త్యాగం చేస్తారా? హై కమాండ్ కు సీఎం రేవంత్ భరోసా ఇచ్చారా? మీనాక్షి కోసం సీటు త్యాగం చేయడానికి సిద్ధపడ్డారా? తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో దీని పైనే చర్చ నడుస్తోంది. పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
నామినేషన్ తిరస్కరణ..
ఇటీవల మధ్యప్రదేశ్‌లో మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ పత్రం తిరస్కరణకు గురైన సంగతి తెలిసిందే. క్రిమినల్ కేసులో నోటీసుల విషయం దాచారని ఈ తిరస్కరణ జరిగింది. అయితే ఈ మొత్తం ఎపిసోడ్లో తెలంగాణ కాంగ్రెస్ నేతలపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. కొందరు తెలంగాణ నేతలు ఉద్దేశపూర్వకంగా బిజెపికి లీకులు అందించారని హైకమాండ్ ఆగ్రహంగా ఉంది. దానిని కూల్ చేసేందుకు గాను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. ఇటీవల రాజ్యసభ సభ్యుడిగా ఎంపికైన తన సన్నిహితుడు వేం నరేందర్ రెడ్డి అవసరం అనుకుంటే పదవిని వదులుకుంటారని నేరుగా రాహుల్ గాంధీతో చెప్పినట్లు ప్రచారం నడుస్తోంది. ప్రస్తుతం తెలంగాణ నుంచి నలుగురు రాజ్యసభ ఎంపీలు ఉన్నారు. రేణుకా చౌదరి, అభిషక్ సింగ్వి, అనిల్ యాదవ్ తో పాటు వేం నరేందర్ రెడ్డి ఉన్నారు. మొన్ననే తన సన్నిహితుడికి సీనియర్లను కాదని రాజ్యసభ సభ్యత్వం ఇప్పించుకున్నారు రేవంత్ రెడ్డి. అయితే ఇప్పుడు మీనాక్షి నటరాజన్ కోసం తన సన్నిహితుడు నరేందర్ రెడ్డి రాజ్యసభ సభ్యత్వం వదులుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధపడుతుండడం విశేషం. హాయ్ కమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మరుక్షణం రాజీనామా చేసేందుకు వేం నరేందర్ రెడ్డి సిద్ధంగా ఉన్నట్లు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్‌లో ప్రచారం నడుస్తోంది.
ఆ కారణంతోనే..
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జిగా ఉన్న మీనాక్షి నటరాజన్ మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎంపిక చేశారు రాహుల్ గాంధీ. ఆమె నామినేషన్ కూడా దాఖలు చేశారు.. హైదరాబాదులో నమోదైన ఓ క్రిమినల్ కేసుకు సంబంధించిన నోటీసుల వ్యవహారం దాచారన్నది ఆమె నామినేషన్ తిరస్కరణకు ప్రధాన కారణం. అయితే ఈ విషయంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలపై ఎక్కువగా విమర్శలు వినిపించాయి. గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితురాలు మీనాక్షి నటరాజన్. ఆమెకు రాజ్యసభ దక్కకుండా చేశారు అని తెలంగాణ కాంగ్రెస్ నేతలపై హై కమాండ్ సీరియస్ గా ఉంది. ఈ నేపథ్యంలో ఆమెకు సముచిత గౌరవం కల్పించేందుకు తెలంగాణ నుంచి రాజ్యసభకు పంపేందుకు ఏఐసీసీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అదే సమయంలో కాంగ్రెస్ హై కమాండ్ పట్ల విధేయత చూపాలని సీఎం రేవంత్ భావిస్తున్నారు. అందుకే తన సన్నిహితుడు వేం నరేందర్ రెడ్డి తో రాజీనామా చేయించి అలా ఖాళీ అవుతున్న సీట్లో మీనాక్షి నటరాజన్ కు అవకాశం కల్పించాలన్నది రేవంత్ ఆలోచన. అటు వేం నరేందర్ రెడ్డిని సీనియర్లను కాదని.. రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక చేయించుకున్నారు. ఇప్పుడు అదే నరేందర్ రెడ్డి రాజీనామాతో హై కమాండ్ వద్ద తన పలుకుబడి పెంచుకోవాలన్న ఆలోచనతో రేవంత్ ఉన్నారు. చివరకు ఏం జరుగుతుందో చూడాలి.