Homeతెలంగాణతెలంగాణలో తవ్వే కొద్ది అవినీతి.. ఏసీబీ దాడి చేస్తే వందల కోట్లు పట్టుబట్టాల్సిందే!!

తెలంగాణలో తవ్వే కొద్ది అవినీతి.. ఏసీబీ దాడి చేస్తే వందల కోట్లు పట్టుబట్టాల్సిందే!!

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో అవినీతి అనేది అన్ని శాఖల్లో విస్తరించి ఉంది. ఏసీబీ దాడుల్లో దొరుకుతున్న అక్రమస్తుల వివరాలు చూసి సామాన్యులు సైతం షాక్ అవుతున్నారు. తాజాగా ల్యాండ్స్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరి నివాసాలపై జరిగిన దాడుల్లో మంచాల కింద లభించిన కోట్లాది రూపాయల నోట్ల కట్టలు, కిలోల కొద్ది బంగారం, లగ్జరీ ప్లాట్ల డాక్యుమెంట్లు చూస్తుంటే అవినీతి ఈ స్థాయిలో జరుగుతుందా అన్న అనుమానం కలుగుతోంది. అంతకుముందు వారం ఆర్ అండ్ బి ఇంజనీర్ ఇన్ చీఫ్ మోహన్ నాయక్ నివాసాల్లో ఏసీబీ జరిపిన దాడుల్లో 200 కోట్ల రూపాయల విలువైన అక్రమ ఆస్తుల కేసులు బయటపడటం ఆందోళన కలిగించింది. ఇక మే నెలలో మేడ్చల్ డిప్యూటీ కలెక్టర్ వంశీ మోహన్ ఇళ్లపై జరిపిన ఏసీబీ దాడుల్లో 100 కోట్ల విలువైన ల్యాండ్ల పత్రాలు దొరికాయి. ఇవన్నీ చూస్తుంటే తెలంగాణలో అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. కేవలం ఒకటి రెండు శాఖల్లో మాత్రమే కాదు.. దాదాపు అన్ని వ్యవస్థల్లో అవినీతి అనేది ఒక సాధారణ ప్రక్రియగా మారిపోయినట్లు అర్థం అవుతోంది.

రూ.100 కోట్లు దాటిన వారే..

ఇటీవల ఏసీబీ రైడింగ్ లో పట్టుబడిన వారంతా 100 కోట్ల రూపాయల క్లబ్ దాటిన వారే. ప్రధానంగా రెవెన్యూ, రిజిస్ట్రేషన్, టౌన్ ప్లానింగ్, మైనింగ్, ఎక్సైజ్, గృహనిర్మాణ శాఖలో కిందిస్థాయి క్లర్క్ నుంచి పై స్థాయి డైరెక్టర్ల వరకు ఒక వ్యవస్థీకృత నెట్వర్క్ ల అవినీతి సాగుతోందని ఎప్పటినుంచో ఆరోపణలు ఉన్నాయి. మీడియాలో సైతం కథనాలు వస్తూ వచ్చాయి. వేళల్లో జీతాలు ఉండే అధికారులు, సిబ్బంది ఇళ్లలో వందల కోట్ల మార్కెట్ విలువైన ఆస్తులు, ఓపెన్ ప్లాట్లు, ఫామ్ హౌస్ లో బయటపడడం దేనికి సంకేతం? వీరికి ప్రభుత్వాలతో పనిలేదు. లంచం ఇవ్వనిది ఫైల్ కదలదు. అంతలా మారిపోయింది తెలంగాణలో అవినీతి తంతు. కేవలం పక్కా సమాచారం తోనే ఏసీబీ రంగంలోకి దిగుతోంది. ఇంకా సమాచారం లేని వారి అవినీతి ఏ స్థాయిలో ఉంటుంది? ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ఇదే హాట్ టాపిక్.

అధికారులను టార్గెట్ చేస్తే..

నెలకు ఒకరిద్దరు అధికారులను టార్గెట్ చేసుకుంటేనే ఈ స్థాయిలో అవినీతి బయటపడుతోంది. అదే కీలక శాఖలో ఉన్న గ్రేడ్ వన్ అధికారులను టార్గెట్ చేస్తే ఎలా ఉంటుంది. ఏకకాలంలో రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తే కచ్చితంగా ఫలితం ఉంటుంది. అనుమానం వచ్చిన ప్రతి అధికారి ఇళ్లతో పాటు బంధువుల ఇళ్లలో తనిఖీ జరిగితే తప్పకుండా వేల కోట్ల రూపాయల అవినీతి ఆస్తులు బయటపడతాయి. వాటిని గాని జెప్పు చేస్తే తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ కు భారీగా ఆదాయం సమకూరుతుంది. అంతలా తెలంగాణ వ్యాప్తంగా అవినీతి సొమ్ము విస్తరించిందన్న అనుమానాలు ఉన్నాయి.

అంతా లంచాల పర్వం..

ఒక కాంట్రాక్టు దక్కాలంటే లంచం. ఎన్ ఓ సి ఇవ్వాలంటే లంచం. చేసిన పనికి బిల్లులు చెల్లించాలంటే లంచం. అభివృద్ధి పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం చుట్టూ తిరుగుతాయి. ఆర్ధిక సంస్థలకు సహాయం అడుగుతాయి. అలా తెచ్చిన సొమ్ము అవినీతి అధికారులకు కొంత మొత్తంలో ఇవ్వనిదే పనులు జరగడం లేదు. ఆ శాఖ ఈ శాఖ అని పేరు పెట్టనవసరం లేదు. అన్ని శాఖల పరిస్థితి అలానే ఉంది. కేవలం సంప్రదాయ ఏసీబీ దాడులకే పరిమితం కాకుండా.. ఆధునిక టెక్నాలజీ, కేంద్ర సంస్థ ఈడీ తరహాలో.. ఐటీ శాఖల సమన్వయంతో ఏసీబీ దాడులు చేస్తే ఇంకా సత్ఫలితం ఉంటుంది. తెలంగాణలో ఏకకాలంలో అవినీతి అధికారులపై దాడులు చేస్తే.. తెలంగాణ సమాజానికి అవసరమైన ఆర్థిక స్వాలంబన దక్కుతుంది. అవినీతిని కొంతవరకు నియంత్రణ చేయవచ్చు. కానీ అంతటి సాహసం ప్రభుత్వం చేయగలదా. ప్రభుత్వ స్థలాలను కాపాడేందుకు హైడ్రా లాంటి వ్యవస్థను తీసుకొచ్చారు. అవినీతిని కూకటి వేళ్లతో పెకిలించేందుకు అటువంటి వ్యవస్థను తీసుకురాగలరా? అలా తెచ్చిన నాడు కచ్చితంగా సంచలనాలు నమోదు కాక తప్పదు. కానీ అంతటి సాహసం చేస్తారా లేదా అన్నది తెలియాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు